గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్ లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'. భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ( జూన్ 4) థియేటర్లలోకి అడుగుపెట్టింది. అయితే లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు చరణ్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన 'పెద్ది' సునామీపై ఎట్టకేలకు నోరు విప్పారు. ఈ సినిమాపై మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
చిరు ఎమోషనల్ పోస్ట్..
ప్రస్తుతం పొల్లాచిలో తన క్రేజీ ప్రాజెక్ట్ #Mega158 షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్నప్పటికీ, చరణ్ రేంజ్‌ను చూసి మురిసిపోయారు చిరంజీవి. సినిమాను వీక్షించి, చిత్ర యూనిట్ మొత్తాన్ని ఆకాశానికెత్తేస్తూ.. సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ పోస్ట్ పెట్టారు. అది క్షణాల్లోనే మోస్ట్ వైరల్‌గా మారిపోయింది.
తండ్రిగా గర్వపడుతున్నా.. నటుడిగా మురిసిపోతున్నా..
రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిపోయిన చిరంజీవి, తన పోస్ట్‌లో ప్రశంసలు కురిపించారు. ఈరోజు 'పెద్ది' చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న నీరాజనాలు, కలెక్షన్ల సునామీ చూస్తుంటే.. ఒక తండ్రిగా నా గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. కేవలం తండ్రిగానే కాదు, ఒక నటుడిగా కూడా చరణ్‌ను చూసి మురిసిపోతున్నాను అని ఆనందం వ్యక్తం చేశారు. అంతే కాదు గడిచిన రెండేళ్లుగా ఈ పాత్ర కోసం చరణ్ పడిన కష్టాన్ని తాను కళ్లారా చూశానని చిరు చెప్పుకొచ్చారు. 'పెద్ది' క్యారెక్టర్‌లోకి చరణ్ పూర్తిగా లీనమైపోయాడు. అతని అంకితభావం, పట్టుదల, సిన్సియారిటీ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ చరణ్ పడిన కష్టానికి దక్కిన నిజమైన ప్రతిఫలం అంటూ కొడుకుపై ప్రశంసల వర్షం కురిపించారు.
బుచ్చిబాబు మ్యాజిక్.. రెహమాన్ మ్యూజిక్!
డైరెక్టర్ బుచ్చిబాబు సనను మెగాస్టార్ ప్రత్యేకంగా అభినందించారు. ఒక అద్భుతమైన కథను అంతే నమ్మకంతో, గ్రాండ్‌గా తెరపై ఆవిష్కరించాడని కొనియాడారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను విజువల్ వండర్‌గా నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారుపై కూడా ప్రశంసలు కురిపించారు.
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ పవర్ ఫుల్ యాక్టింగ్, జగపతి బాబు విలనిజం, గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించిన జానీ కపూర్, దివ్యేందుల నటనను చిరు మెచ్చుకున్నారు. ఇక ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రత్నవేలు సినిమాటోగ్రఫీ, కొల్లా అవినాష్ ఆర్ట్ వర్క్, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయని కొనియాడారు.
బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ విధ్వంసం..
టాక్ విషయానికొస్తే.. థియేటర్లలో 'పెద్ది' జాతర నడుస్తోంది. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇదొక మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోతుందని, తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచస్థాయికి తీసుకెళ్తుందని మెగాస్టార్ ఆశాభావం వ్యక్తం చేశారు. అటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డుల వేటను కొనసాగిస్తోంది. చరణ్ మేకోవర్, ఎమోషనల్ యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ థియేటర్లలో పూనకాలతో ఊగిపోతున్నారు. మెగాస్టార్ ట్వీట్‌తో 'పెద్ది' క్రేజ్ ఇప్పుడు మరింత హైప్ కు తీసుకువెళ్లింది..
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2026
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ… pic.twitter.com/gZwN99aERV
