భోళా శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. మరీ ఈ రేంజ్లోనా?

భోళా శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. మరీ ఈ రేంజ్లోనా?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh), అక్కినేని హీరో సుశాంత్(Sushanth) ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మించిన ఆగష్టు 11న గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చింది. తమిళ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా వచ్చిన భోళా శంకర్ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ వచ్చింది.

నార్మల్ ఆడియన్స్ మాత్రమే కాదు.. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడంలేదు. దీంతో భోళా శంకర్ కలెక్షన్స్ అంతగా రాలేదు. చిరంజీవి గత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. భోళా శంకర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.30 కోట్ల గ్రాస్, రూ.15 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసినట్టు సమాచారం. మెగాస్టార్ గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇక తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటిరోజు రూ.12 కోట్లు కలెక్ట్ చేయగా..  మిగిలిన ప్లేసెస్ లో కలిపి రూ.3 కోట్లు మాత్రమీ కలెక్ట్ చేసింది.
 
ఇక భోళా శంకర్ సినిమాకు దాదాపు రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. ఇక సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఆ రేంజ్ కలెక్షన్స్ రావడం కష్టమే అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఇక మరోవైపు రజనీకాంత్ జైలర్ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో.. ఆ ఎఫెక్ట్ కూడా భోళా శంకర్ కలెక్షన్స్ పడనుంది. ఇక మొత్తంగా చూసుకుంటే చిరు కెరీర్ లో మరి డిజాస్టర్ చేరిపోయింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.