
నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. బెంగళూరులోని నారాయణ హృదాయాలయలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. అయితే తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ నందమూరి ఫ్యాన్స్ కు ఊరటనిచ్చేలా ఉంది. తారకరత్న కోలుకుంటున్నారని చిరు అన్నారు. ‘‘తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంకా ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఈ పరిస్థితి నుంచి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. నువ్వు నిండు నూరేళ్లు.. ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను మై డియర్ తారకరత్న’’ అంటూ చిరు ట్వీట్ చేశారు.