Chiru gift to Trisha: విశ్వంభర సెట్లో త్రిష.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన చిరు

Chiru gift to Trisha: విశ్వంభర సెట్లో త్రిష.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన చిరు

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), దర్శకుడు వశిష్ట(Vassishta) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara). సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షెరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలోల చెన్నై చిన్నది త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె కూడా ఇటీవలే విశ్వంభర సెట్స్ లో అడుగుపెట్టారు. 

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో భాగంగా సెట్స్ కి వచ్చిన త్రిషకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడట చిరంజీవి. ఇదే విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు చిరంజీవి. ఈ విషయం గురించి ఆమె చెప్తూ.. ఖరీదైన టెంపరేచర్ కంట్రోల్డ్ మగ్. నాకు చాలా నచ్చింది చిరంజీవి గారు. మీకు కృతజ్ఞతలు.. అంటూ రాసుకొచ్చారు త్రిష. ప్రస్తుతం త్రిష చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ALSO READ :- Allu Arjun: వైజాగ్లో పుష్పరాజ్ మాస్ ఎంట్రీ.. భారీగా వచ్చిన అభిమానులు

ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఈ సినిమాకు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన విశ్వంభర టైటిల్ వీడియో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అంతేకాదు ఈ టైటిల్ వీడియో సినిమాపై అంచనాలను కూడా భారీగా పెంచేసింది. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. మరి ఎన్నో ప్రత్యేకతలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.