ఓటీటీలోకి రానున్న.. మెగాస్టార్ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్

ఓటీటీలోకి రానున్న.. మెగాస్టార్ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్.. ఇలా ఏ ఇండస్ట్రీ తీసుకున్న నటనకు ప్రాణమిచ్చే నటులుంటారు. అందులో కొందరు అందంగా నటిస్తారు. మరి కొందరు నటనకి కొత్త నిర్వచనం ఇస్తారు. ఇంకొందరు అయితే.. అసలు నటనంటే అదే అన్నంతగా మెప్పిస్తారు. ఈ మూడు దశలనూ దాటి మెగాస్టార్ అయ్యారు హీరో మమ్ముట్టి(Mammootty). బేసిగ్ గా మమ్ముట్టి మలయాళ నటుడే అయినప్పటికి ఇతర భాషల్లోనూ ఆయన మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా..సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఎంతోమందికి ఫేవరేట్ యాక్టర్ అయ్యారు. 

లేటెస్ట్ గా మమ్ముట్టి నటిస్తూ..నిర్మించిన చిత్రం క‌న్నూర్ స్క్వాడ్‌ (Kannur Squad). గత నెల 2023 సెప్టెంబ‌ర్ 28న విడుద‌లైన ఈ సినిమా.. రిలీజై మలయాళ బాక్సాపీసును దుమ్ము దులిపేస్తుంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..క‌న్నూర్ స్క్వాడ్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. న‌వంబ‌ర్ 10 నుంచి ఈ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్స్టార్‌ (Disney + Hotstar)లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్న‌ట్లు తెలిసింది.కేర‌ళ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన క‌న్నూర్ స్క్వాడ్‌ సినిమాను రాబీ వ‌ర్గీస్ రాజ్ ద‌ర్శ‌కత్వం వహించారు.

క‌న్నూర్ స్క్వాడ్‌ కథ విషయానికి వస్తే..

క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని.. మ‌మ్ముట్టి కెరీర్‌లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ..వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ఈ 2023లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన..మ‌ల‌యాళ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. అంతే కాకుండా మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఆరో సినిమాగా క‌న్నూర్ స్క్వాడ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో సాగుతూ..క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌ లో వచ్చిన బెస్ట్ మూవీస్ లో నెం.1 స్థానం ఉంటుందని సినీ క్రిటిక్స్ భావిస్తున్నారు. IMDb లో 8.9/10 రేటింగ్ తో శభాష్ అనిపించుకుంది. రీసెంట్ గా మమ్ముట్టి తెలుగులో యాత్ర‌, ఏజెంట్ వంటి సినిమాల్లో నటించారు.