ట్రెండీ హెయిర్ ​స్టైల్స్​ కావాలంటే..

ట్రెండీ హెయిర్ ​స్టైల్స్​ కావాలంటే..
ట్రెండీగా.. స్టైలిష్ గా కనిపించాలని డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తుంటారు అబ్బాయిలు. అయితే ఆ తర్వాత అవి ఫేస్​కి సూట్ కాక ఇబ్బంది పడుతుంటారు. హెయిర్ కట్ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలియక కన్​ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి వాళ్లకోసం బ్యూటీ ఎక్స్​పర్ట్స్​ చెప్తున్న కొన్ని జాగ్రత్తలివి. ట్రెండింగ్​లో ఉన్న హెయిర్​స్టైల్స్, వాటి స్టైలింగ్​కి ముందు, తర్వాత ​ తీసుకోవాల్సిన కేర్​ గురించి వాళ్ల మాటల్లోనే.. ఏ  హెయిర్ స్టైల్​కి అయినా  రెండు నెలల ముందు నుంచి జుట్టు పెంచాలి. పెరుగుతుంది కదా అని జుట్టుని అలాగే వదిలేయకుండా ఎప్పటికప్పుడు దానికి న్యూట్రిషన్​ అందించాలి.  ప్రొటీన్​ ఫుడ్​  ఎక్కువగా తినాలి. గోరువెచ్చని నూనెతో తలకు రెగ్యులర్​గా  మసాజ్ చేయాలి. వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తుండాలి. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా మెరవాలంటే  మందారం రేకులను బాగా రుబ్బి, ఆ పేస్ట్​ని  కొబ్బరినూనె లేదా నట్స్ ఆయిల్​లో కలిపి తలకు మర్దనా చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు నల్లగా, మందంగా ఉంటుంది. అప్పుడే ఎలాంటి హెయిర్​ స్టైల్​ అయినా పర్ఫెక్ట్​ షేప్​లో వస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఉల్లిగడ్డ రసంలో తేనె కలిపి కూడా తలకి పట్టించొచ్చు. హెయిర్ కట్ తర్వాత హెయిర్ కట్ చేయించుకున్న తర్వాతే  జుట్టుకు ఎక్కువ కేర్ అవసరం. హెయిర్ స్టైల్  మెయింటైన్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత  హెయిర్ స్టైలింగ్​కి  చేతి వేళ్లను ఉపయోగించకూడదు. మెత్తటి  బ్రష్ ను మాత్రమే వాడాలి. హెయిర్ స్టైలింగ్ తర్వాత హెయిర్ పొజిషన్ మారుతుంది. కొద్దిగా వంగినట్లు, ముడుచుకున్నట్లు కనిపిస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడాలంటే  కండిషనర్  వాడాలి. హెయిర్ కట్ షేప్ మారకుండా ఉండాలన్నా.. చిక్కుపడకూడదన్నా కండిషనర్​ తప్పనిసరి. సిరమ్ ఉపయోగించడం వల్ల జుట్టు స్మూత్​గా, సిల్కీగా ఉంటుంది. హెయిర్ వాష్ తర్వాత కూడా జుట్టు పట్టులా మెరుస్తుంది. హెయిర్ స్టైల్ మార్చిన వెంటనే జుట్టు ముడి వేయకూడదు. అలా చేస్తే హెయిర్ కట్ పోయి జుట్టు షేప్ మారిపోతుంది. కలర్ వేసుకుంటే.. జుట్టు నెరిసినప్పుడు మాత్రమే కాదు హెయిర్ స్టైల్ ని బట్టి కూడా ఇప్పుడు చాలామంది జుట్టుకు కలర్స్ వేస్తున్నారు. బ్రౌన్, గోల్డెన్, మెరూన్, పర్పుల్, హనీ బ్రౌన్​, చెర్రీ వంటి కలర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే నచ్చిన కలర్​ని జుట్టుకు వేసుకోకుండా ఎక్స్ పర్ట్స్ సాయంతో కలర్ వేసుకోవడం మంచిది.   జుట్టు, ముఖాన్ని బట్టి రంగు సెలక్ట్ చేసుకోవాలి. జుట్టుకు రంగేసుకున్న  తర్వాత హార్డ్ షాంపూ, డాండ్రఫ్ షాంపూలు వాడకూడదు. ముఖ్యంగా కెమికల్స్, సల్ఫేట్ లేని షాంపూలు ఎంచుకోవాలి.   షాంపూ చేసుకున్న ప్రతి సారీ తప్పనిసరిగా కండిషనర్​ వాడాలి. అందులోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉండే కండిషనర్లను వాడాలి.   కలరింగ్ తర్వాత జుట్టును ఆరబెట్టాలంటే  బ్లో డ్రై లు వాడకుండా ఉండటం మంచిది.   రంగు వేసుకున్న తర్వాత హెయిర్ ప్యాక్ వేసుకోవాలనుకుంటే ఎక్స్ పర్ట్ సాయంతో జుట్టుకు హానిచేయని ప్యాక్ లు వేసుకోవాలి.   తలస్నానం చేయడానికి ముందు కొబ్బరి నూనె రాయాలి. వారానికి ఒకసారి హెయిర్ స్పా ట్రీట్ మెంట్ తీసుకుంటే కలర్ ఎక్కువ కాలం ఉంటుంది. టాప్ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ఇవే.. లాంగ్ వన్ సైడ్ హెయిర్ స్టైల్ దీన్నే అండర్ హెయిర్ కట్ అని కూడా పిలుస్తారు. గుండ్రటి, కోల ముఖాలకు కూడా ఈ స్టైల్​ బాగుంటుంది. దీనికి హెయిర్ బాగా పెంచాలి. అప్పుడే అందంగా కనిపిస్తుంది. పంకీ హెయిర్ స్టైల్ స్పైస్ హెయిర్ కట్ అని కూడా  పిలుస్తారు ఈ పంకీ హెయిర్​ స్టైల్​ని . ఏ రకమైన జుట్టువాళ్లకైనా ఇది సెట్ అవుతుంది. పిల్లలు ఎక్కువగా ఈ హెయిర్​స్టైల్​నే ఫాలో అవుతున్నారు ఈ మధ్య . హెయిర్ ని బాగా షార్ట్  చేయడమే ఈ స్టైల్ స్పెషల్. లాంగ్ బ్రౌన్ కేర్ లెస్ హైలెట్స్ చేయడమే ఈ కట్ ప్రత్యేకం. లెంగ్తీగా పెంచి జుట్టును వదిలేస్తారు. ఆ తర్వాత బ్రౌన్ కలర్​తో హైలెట్స్ చేస్తారు. ఏ ఫేస్ కైనా ఈ హెయిర్ కట్ సెట్ అవుతుంది. లెంగ్త్​ అండర్ కట్ ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉన్న హెయిర్​కట్​లలో ఇదీ ఒకటి. చుట్టూ జుట్టు  కట్ చేసి మధ్యలో వదిలేయడమే ఈ కట్ స్పెషల్. ఇవి కూడా చదవండి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ అప్డేట్: కనిపించని వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు ముల్లంగి ఒకటి రెండు ముక్కలతో సరిపెడుతున్నారా..? ఇది మీకోసమే