ఆడోళ్లకే కాదు మగవాళ్లకూ స్కిన్ కేర్ అవసరమే

ఆడోళ్లకే కాదు మగవాళ్లకూ స్కిన్ కేర్ అవసరమే

చాలామంది అబ్బాయిలు స్కిన్ కేర్‌‌‌‌పై సరిగా దృష్టి పెట్టరు. స్కిన్‌‌ డ్యామేజ్‌‌ అవడానికి కారణాలైన వర్క్, ప్రెషర్స్ వంటి వాటి గురించి అసలే పట్టించుకోరు. కానీ, సరైన జాగ్రత్త తీసుకోకపోతే ముఖంపై ఉండే చర్మం పాలిపోతుంది. రఫ్‌‌గా తయారవుతుంది. కళ తప్పి నిర్జీవంగా మారుతుంది. అందుకే, స్మార్ట్‌‌గా కనిపించాలంటే మగవాళ్లకూ కేర్ అవసరమే.

ముఖంపై ఎలాంటి మచ్చలు, ముడతలు, పింపుల్స్ ఉండకూడదు. అప్పుడే ఫేస్ అందంగా, అట్రాక్టివ్‌గా ఉంటుంది. స్కిన్ కలర్ ఏదైనా సరే హెల్దీగా, నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. అందుకే, స్కిన్ డ్యామేజ్ చేసే వాటికి దూరంగా ఉండాలి.

స్మోకింగ్  

చర్మం నిగారింపు తగ్గిపోవడానికి కారణాల్లో స్మోకింగ్ ఒకటి. ఈ అలవాటు ఉన్నవాళ్లకు చర్మం పాలిపోతుంది. తొందరగా ముడతలు వస్తాయి. ఎన్ని కాస్ట్లీ క్రీములు వాడినా ఫలితం ఉండదు.

డ్రింకింగ్

రెగ్యులర్‌‌గా మద్యం తాగుతుంటే చర్మం నిగారింపు కోల్పోతుంది. మందు తాగడం వల్ల నిద్రలో అనేక మార్పులు వస్తాయి. ఒక్కోసారి డీప్ స్లీప్‌, మరోసారి కలత నిద్ర ఉంటుంది. ఫేస్‌పైనే దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. దీంతో చర్మంపై మెరుపు పోయి పేలవంగా తయారవుతుంది.

ఎండకు తిరిగి…

ఎక్కువగా బయట తిరుగుతున్నా చర్మం డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా ఎండలో బయటకు వెళ్లినప్పుడు చాలామంది అబ్బాయిలు అంతగా కేర్ తీసుకోరు. పైగా ఎక్కువ టైం ఎండలోనే ఉంటారు. దీంతోచర్మం మీద సూర్యకిరణాలు డైరెక్ట్​గా పడతాయి. దీనివల్ల చర్మం డల్‌గా తయారవుతుంది. ట్యాన్‌ పెరిగిపోయి స్కిన్ కలర్ మారిపోతుంది.

ఒత్తిడి

ఉద్యోగ, వ్యాపార బాధ్యతల వల్ల చాలామందిపై స్ట్రెస్ ఎక్కువగా పడుతుంది. కొంతమంది నైట్ షిఫ్ట్స్ చేస్తారు లేదా లేట్ నైట్‌ వరకూ ఆఫీసుల్లో ఉంటారు. దీనివల్ల కూడా నిద్రకు బ్రేక్ పడుతుంది. ఇది కూడా చర్మాన్ని డ్యామేజ్ చేస్తుంది.

కేర్ ఇలా

కనిపించిన సబ్బునల్లా ముఖానికి వాడుతుంటారు చాలామంది అబ్బాయిలు. కానీ, ఇది కరెక్ట్ కాదు. రెగ్యులర్‌‌గా ఒక సోప్‌ని మాత్రమే వాడాలి.  లేదంటే అసలు సోప్ వాడొద్దు, దాని బదులు ఫేస్ వాష్‌లు వాడటం మంచిది.

ఆడవాళ్ల చర్మం కంటే మగవాళ్ల చర్మం తొందరగా పొడిబారిపోతుంది. దానివల్ల ఎక్కువ కేర్ తీసుకోవాలి. చర్మాన్ని బట్టి మాయిశ్చరైజర్‌‌ని సెలక్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం, రాత్రి పడుకునే ముందు చర్మానికి రాయాలి.

షేవింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన క్రీములు వాడితే చర్మం డ్యామేజ్ కాదు.

ఎండలు పెరుగుతున్న టైంలో బయటకు వెళ్లాల్సి వచ్చినా, బయటే ఎక్కువ టైం పనిచేయాల్సి వచ్చినా కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ రాయాలి. యూవీ కిరణాల వల్ల చర్మంపై ముడతలు వస్తాయి. వీటిని కూడా సన్ స్క్రీన్ లోషన్ కంట్రోల్ చేస్తుంది.

ఫేస్ ప్యాక్స్

చర్మంపై పేరుకున్న మురికి, డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో ఫేస్ ప్యాక్స్ బాగా ఉపయోగపడతాయి. కొత్త సెల్స్ తయారీకి సాయపడతాయి. అందుకే రెగ్యులర్‌‌గా ఫేస్ ప్యాక్స్ వేసుకోవాలి. దీనివల్ల చర్మం హెల్దీగా, అందంగా ఉంటుంది.

ముఖంపై ముడతలు ఉంటే నిమ్మరసం, శెనగపిండి కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. చల్లని నీళ్లతో కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం మృదువుగా, హెల్దీగా ఉంటుంది.

స్కిన్ మిలమిల మెరవాలన్నా, మచ్చలు, ట్యాన్‌ పోవాలన్నా అలోవెరా బెస్ట్ ప్యాక్. ఈ జెల్‌తో ముఖంపై నేరుగా మసాజ్ చేయాలి. పది నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీళ్లతో క్లీన్ చేయాలి.

ఫేస్‌పై ఉండే డార్క్ ప్యాచ్‌లను పోగొట్టే శక్తి తేనెకు ఉంది. తేనెలో పాలు లేదా నిమ్మరసం కలిపి అప్పుడప్పుడు ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి.

బాగా పండిన టొమాటో ముక్కతో ముఖంపై మసాజ్ చేయాలి. కాసేపు ఆరనిచ్చి నీళ్లతో కడగాలి. టొమాటోలో ఉండే బీటా కెరోటిన్ ట్యాన్‌ను తొలగించి చర్మాన్ని బ్రైట్‌గా చేస్తుంది.

బియ్యప్పిండిలో నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకున్నా మంచిదే. రెగ్యులర్‌‌గా ఈ ప్యాక్ వేసుకుంటే డెడ్ స్కిన్ లేయర్స్ పూర్తిగా తొలగిపోతాయి.

పెరుగు, నిమ్మరసం ముఖానికి రాసినా మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత పది నిమిషాలు ఆరనిచ్చి నీళ్లతో కడగాలి.

ఇవి కూడా చదవండి

సింగి ల్ .. రెడీ టు మింగి ల్ ..

ఈ పోలీసుల రూటే సెపరేటు.. ప్రజల్ని పరిగెత్తిస్తున్నారు

రూ. 431 కోట్లు కట్టండి : బార్క్​కు టైమ్స్ గ్రూప్ లీగల్ నోటీసు

టెస్లా రాకతో రూపురేఖలు మారిపోనున్న.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌‌