గుసగుసల్లో ఎవరు ఫస్ట్​.. ఆడవాళ్లు.. మగవాళ్లలో ఎవరు సీక్రసీ మెయింటైన్​ చేస్తారో తెలుసా..

గుసగుసల్లో ఎవరు ఫస్ట్​.. ఆడవాళ్లు.. మగవాళ్లలో ఎవరు సీక్రసీ మెయింటైన్​ చేస్తారో తెలుసా..

ఇద్దరు కలిస్తే గుస గుసలు మొదలు పెడతారు.. అదేనండి ఒకరి చెవిలో మరొకరు నోరు పెడతారు. అది ఆడవారైనా.. మగ వారైనా.. ఇంతకూ వారేమి మాట్లాడుకుంటారు.. ఇద్దరే కదా ఉంది అంత సీక్రెట్​ గా ఎందుకు మాట్లాడుకుంటారు.. పక్కనున్న వారు ఎవరో తెలియక పోయినా సరే గుసగుసల పేరిట సీక్రసీ మెయింటైన్​ చేస్తారు.. అయితే ఈ విషయంలో ఆడవాళ్లు ఎక్కువమంది ఉన్నారా మాట్లాడుకుంటారా.. మగవాళ్లు ఎక్కువమంది ఉన్నారా అనే దాని గురించి  కాలిఫోర్నియాలో ఓ యూనివర్శిటీ అధ్యయనం చేసింది.  .. ఆ నివేదిక ప్రకారం.. ఆడవారు ఏమేమి మాట్లాడుకున్నారు.. మగవారు ఏ విషయాల గురించి చర్చించుకున్నారు.. ఈ సర్వేను ఎలా చేశారు.. గుసగుసల్లో ఆడవాళ్లు ... మగవాళ్లలో ఎవరు బెటర్​ అనే విషయాల గురించి తెలుసుకుందాం. . .

ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకునుటప్పుడు .. మరో మహిళ గురించి చర్చించుకుంటారట.. ఆమె  అట్లా.. ఇట్లా.. అంటూ మొదలు పెట్టి  ఆ తర్వాత ఏం మాట్లాడుకుంటారో.. ఏం చెప్పుకుంటారో.. ఒక్క ముక్క కూడా పక్కోళ్లకు వినిపించదు. కానీ.. ఎవరికైతే చెప్తున్నారో.. వారికి మాత్రం పక్కాగా వినిపిస్తుంది. అది ఆడోళ్ల గుసగుసల మహిమ. అయితే.. తాజాగా చేసిన ఓ స్టడీలో గుసగుసల్లో ఆడోళ్లకంటే.. మగవాళ్లే బెటర్ అని తేలింది. అంతే కాదు.. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ సంగతులు వెల్లడయ్యాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ల అధ్యయనంలో  తేలింది.  

 యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్లు టెక్నాలజి ఉపయోగించి ..   ఏకంగా 467 మంది మీద అధ్యయనం చేశారు. వీరిలో  269 మంది మహిళలు, 198 మంది పురుషులు ఉన్నారు.  ఒకరోజంతా వీరిని పరిశీలించి  వారేం మాట్లాడుకున్నారు అనే అంశం మీద దృష్టి పెట్టారు. వీరందరికీ ఇయర్ (ఈఏఆర్ -ఎలక్ట్రానికల్లీ యాక్టివేటెడ్ రికార్డర్స్) జతచేశారు. ఈ పరికరం సహయంతో రోజంతా వారు మాట్లాడుకునేది రికార్డు చేశారు. ఆ తర్వాత తీరికగా అందులో రికార్డు అయిన మాటలన్నింటినీ విన్నారు. అందులో.. అందరికీ వినబడేలా మాట్లాడుకున్న మాటల కంటే.. ఎవరికీ వినిపించకుండా గుసగుసగా మాట్లాడుకున్నవే ఎక్కువగా ఉన్నాయట. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారంతా 18 నుంచి 58 ఏళ్ల మధ్య వయసువారే.

స్టడీ ఇలా సాగింది..

467 మందికి అమర్చిన ఎలక్ట్రానికల్లీ యాక్టివేటెడ్ రికార్డర్లలో నమోదైన రికార్డులన్నింటినీ నెగెటివ్, పాజిటివ్, స్యూట్రల్ అని మూడు కేటగిరీలుగా విభజించారు. వాటిలో నెగెటివ్ విషయాల్లో ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. పాజిటివ్ విషయాల్లో ఎవరి గురించి మాట్లాడుకున్నారు. న్యూట్రల్ అంశాల్లో ఎవరి గురించి మాట్లాడుకున్నారనే దిశగా పరిశోధన చేశారు. అందులో.. సెలబ్రిటీల గురించి... అమ్మాయిలైతే అబ్బాయిల గురించి, అబ్బాయిలైతే అమ్మాయిల గురించి మాట్లాడుకున్నారట. అయితే.. ఈ అంశాల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ గుసగుసలాడారట.

 ముచ్చట్లన్నీ పక్కోళ్ల గురించే.... 

మామూలుగా ముగ్గురు స్నేహితులు కలిస్తే.. ముగ్గురిలో ఒకరు బకరా అవుతారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఇద్దరు కలిస్తే.. మాత్రం ఆ మూడో గురించే మాట్లాడుకుంటారట. మన పక్కన లేని వ్యక్తి గురించి ఎన్నో విషయాలు ఎవరికీ వినిపించకుండా గుసగుసలాడుకుంటారని . ఈ సర్వేలో  తేలింది. ఆ రికార్డుల ముచ్చట  విన్న తర్వాత వాటిలో లెక్కేస్తే.. 4003 సందర్భాల్లో ఎక్కువగా ఇతరుల గురించే గుసగుసలాడారట. అందులో... కూడా మగవారి గుసగుసలే ఎక్కువున్నాయి.

గాసిప్స్ పై ఆసక్తి ..

సహజంగానే మనిషికి ఇతరుల విషయాల్లో కుతూహలం ఎక్కువ. పక్కవారి గురించి మాట్లాడుకోవడంలో ఉన్నంత ఆసక్తి సొంత విషయాల మీద చూపించరు. అందుకే.. ఎక్కువగా గుసగుసల మీద ఆధారపడుతారు. అప్పటికప్పుడు తాము అనుభవిస్తున్న ఒక రకమైన భావన నుంచి మార్పు కోరుకునేందుకు గాసిప్స్ మీద ఆధారపడతారు. తమకు బాగా తెలిసిన వ్యక్తుల గురించి, ఎవరో తెలియని వ్యక్తుల గురించి గాసిప్స్ చెప్పుకోడానికి ఆసక్తి చూపుతారు. అపరిచితుల గురించి కూడా ఎవరైనా గుసగుసలు చెప్పుకొంటుంటే.. ఆసక్తిగా వింటాం. కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు చేసిన సర్వేలో వారు చెప్పిన విషయాలు చాలా వరకు వాస్తవమే. కాకపోతే.. మహిళల కంటే మగవారు గాసిప్స్ వినడంలో,మాట్లాడుకోవడంలో ముందున్నారన్నవిషయం ఆసక్తికరం.

నమ్మలేని గుసగుసలు..

  • ఆడవారి కంటే మగవారే 52 నిమిషాలు ఎక్కువగా గుసగుసలాడుతున్నారు.
  • టీనేజ్ అబ్బాయిలు ఈ గుసగుసల జాబితాలో.. ముందు వరుసలో నిలిచారు.
  • పేదవారు డబ్బున్న వారి గురించి, ఓడిపోయిన వారు గెలిచిన వారి గురించి ఎక్కువగా గుసగుస పెట్టారు.
  • పని ప్రదేశాల్లో 58 శాతం మంది గుసగుసలు పెడతారు.
  • పక్కోళ్లకు వినిపించకుండా, అనుమానం రాకుండా గుసగుస పెట్టడం ఒక కళ అంటున్నారు నిపుణులు.
  • బాగా పాపులర్ అయిన వారి గురించి పెట్టుకునే గుసగుసలు చాలా ఆసక్తిగా ఉంటాయి.