Asia Cup 2023 Final: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్

Asia Cup 2023 Final: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్

ఏషియన్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. శనివారం పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్ లో 6-4తో ఓడించి భారత హాకీ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. హాకీ 5 ఫార్మాట్‌లో పాకిస్తాన్‌ను ఓడించడం భారత్‌కు ఇదే తొలిసారి. 

మొదటి అర్ధభాగంలో పాకిస్తాన్ 3-2 ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. రెండో అర్ధభాగంలో మహ్మద్ రహీల్ రెండు గోల్స్ అందించాడు. దీంతో 4-4తో ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో గేమ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. అనంతరం జరిగిన పెనాల్టీ షూటౌట్‌లో, పాకిస్తాన్ ఒక గోల్ మాత్రమే చేయగా.. భారత్‌ రెండు గోల్స్ చేసి విజేతగా నిలిచింది. షూటౌట్‌లో భారత్ తరఫున మనీందర్ సింగ్, గుర్జోత్ సింగ్ గోల్స్ చేశారు.

పాకిస్థాన్‌(గోల్స్): అబ్దుల్ రెహ్మాన్ (5వ నిమిషం), అబ్దుల్ రానా (13వ నిమిషం), జిక్రియా హయత్ (14వ నిమిషం), అర్షద్ లియాకత్ (19వ నిమిషం)
భారత్‌ (గోల్స్): జుగ్రాజ్ సింగ్ (7వ నిమిషం), మణిందర్ సింగ్ (10వ నిమిషం), మహ్మద్ రహీల్ (19వ నిమిషం, 26వ నిమిషం).