
రాజ్‌గిర్ (బీహార్): ఇండియా మెన్స్ హాకీ టీమ్.. ఆసియా కప్‌లో ఫైనల్ బెర్త్‌పై గురి పెట్టింది. ఈ నేపథ్యంలో శనివారం సూపర్–4లో చైనాతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కొరియాతో తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఇండియా తర్వాత 4–1తో మలేసియాను ఓడించింది. చైనాతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా.. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాలుగు పాయింట్లతో టైటిల్ ఫైట్‌కు అర్హత సాధిస్తుంది. ఇది జరగాలంటే ఇండియా అన్ని రంగాల్లో మరింత మెరుగ్గా ఆడాల్సి అవసరం చాలా ఉంది. ఇప్పటికీ జట్టు పెర్ఫామెన్స్‌పై చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ పెద్దగా సంతృప్తితో లేడు. కాబట్టి ఈ మ్యాచ్‌లోనైనా పూర్తి స్థాయిలో ఆడి ఫైనల్‌కు మరింత సిద్ధంగా ఉండాలని టీమ్ భావిస్తోంది.
అనుభవజ్ఞుడైన మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, రాజిందర్ సింగ్ మిడ్ ఫీల్డ్‌ను అత్యుత్తమంగా నడిపిస్తున్నారు. వాళ్లకు ఫార్వర్డ్ లైన్ నుంచి మరింత సమన్వయం అవసరం. హార్దిక్ వేగవంతమైన డ్రిబ్లింగ్ ఇండియాకు కలిసొచ్చే అంశం. దీనివల్ల ఫార్వర్డ్స్‌కు అవకాశాలు బాగా లభిస్తున్నాయి. మన్‌ప్రీత్, అభిషేక్, సుఖ్‌జీత్, మన్‌దీప్ అద్భుతంగా రాణిస్తున్నారు. రాబోయే మ్యాచ్‌ల్లోనూ వీళ్ల ఫామ్ కంటిన్యూ అయితే ఇండియాకు తిరుగుండదు. గాయం నుంచి కోలుకుని వచ్చిన శీలానంద్ లక్రా మరింత పుంజుకోవాలి. అందరూ బాగా ఆడుతున్నా.. పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో ఫెయిల్ కావడం జట్టు లయను దెబ్బతీస్తోంది. ఈ విషయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సక్సెస్ అవుతున్నా.. జుగ్‌రాజ్ సింగ్, సంజయ్, అమిత్ రోహిడాస్ ఇబ్బందిపడుతున్నారు. మలేసియాతో మ్యాచ్‌లో ఆరు పెనాల్టీలు లభించినా ఒక్క దాన్ని మాత్రమే గోల్‌గా మలిచారు. అది కూడా రీ బౌండ్ ద్వారా వచ్చింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఎక్కువగా పెనాల్టీలపై దృష్టి పెట్టాలి. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్‌కు షాకిచ్చిన చైనా కూడా విజయంపైనే కన్నేసింది. అదే ఫామ్‌ను ఇందులోనూ కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియాపై ఎలాంటి తప్పులు చేయకుండా అంచనాలను అందుకోవడానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మరో సూపర్–4 మ్యాచ్‌లో మలేసియా.. కొరియాతో తలపడుతుంది. సూపర్–4లో టాప్–2లో నిలిచిన జట్ల మధ్య ఆదివారం ఫైనల్ జరుగుతుంది.