నెలసరి.. వైకల్యం కాదు : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

నెలసరి.. వైకల్యం కాదు : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ: మహిళలకు నెలసరి అనేది వైకల్యం కాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.  బుధవారం రాజ్యసభలో ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. మహిళల జీవితంలో నెలసరి అనేది సహజ ప్రక్రియ అని తెలిపారు. వారికి పెయిడ్ లీవ్ ఇచ్చే ప్రతిపాదనను ఆమె వ్యతిరేకించారు. నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలిపారు.

10 నుంచి 19 ఏళ్ల లోపు బాలికల్లో నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ఇప్పటికే కేంద్రం ఓ స్కీమ్ ను అమలు చేస్తోందన్నారు. అంతకు ముందు లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మహిళలకు నెలసరి పెయిడ్ లీవ్స్ పై ప్రశ్నించగా స్మృతి ఇరానీ సమాధానమిచ్చారు. మహిళలకు అన్ని కార్యాలయాల్లో వేతనంలో కూడిన నెలసరి సెలవులు ఇచ్చే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని ఆమె స్పష్టం చేశారు.