అసలు ఆ 40 మంది బతుకుతారా లేదా.. ఐదో రోజుకు టన్నెల్ రెస్క్యూ

అసలు ఆ 40 మంది బతుకుతారా లేదా.. ఐదో రోజుకు టన్నెల్ రెస్క్యూ

ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించే రెస్య్కూ ఆపరేషన్ ఐదో రోజు కొనసాగుతోంది. కార్మికులు బయటకు తీసుకొచ్చేందుకు ఆగర్ డ్రిల్ మిషన్ సిద్ధం చేస్తున్నారు.టన్నెల్ లో  ఇరుక్కుపోయిన కార్మికుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
 
ఉత్తరకాశీలోని సిల్క్వారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకు పోయిన కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ టీం శ్రమిస్తున్నారు. శిథిలాలను తవ్వి చిక్కు కున్న వారిని రక్షించే ప్రక్రియ వేగవంతం చేశారు. దీనికోసం ఆగర్ డ్రిల్ యాంత్రాన్ని రంగంలోకి దింపారు. అంతేకాకుండా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు నిరంతరం కమ్యూనికేషన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. 

నార్వే, థాయ్ లాండ్ కు చెందిన నిపుణులు సొరంగం ఉన్న పర్వతాల పెళుసుగా ఉన్న స్థితిని పరిగణనలోకి తీసుకొని 800 మి.మీ ఎవాక్యూయేషన్ ట్యూబ్ లను చొప్పించేందుకు యత్నిస్తున్నారు. 

చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు శిథిలాల ద్వారా 900 మి.మీ. పెద్ద పైపును వేయడానికి రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది. సొరంగం నుంచి కార్మికులు బయటపడటానికి పైపులో ట్రాక్ లను అమర్చవచ్చని.. తద్వారా కార్మికులను ఈజీగా బయటకు తీసుకొచ్చేందుకు అవకాశం ఉందని రెస్క్యూ టీమ్ భావిస్తోంది.

ఢిల్లీ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెర్క్యూలస్ విమానం కొత్త ఆగర్ డ్రిల్ మిషీన్ ను సొరంగం వద్దకు చేర్చింది.డ్రిల్లింగ్ మిషన్, దాని భాగాలు మూడు ట్రక్కులలో సొరంగం దగ్గరకు చేర్చారు. 24 టన్నుల బరువున్న డ్రిల్లింగ్ మెషిన్ దాని సామర్థ్యానికి తగ్గట్టుగా పనిచేస్తే.. అది గంటకు 5మి.మీ వేగంతో సొరంగాన్ని కత్తిరించగలదు.

Also Read:-జమ్మూ కాశ్మీర్ లో 3.9 తీవ్రతతో భూకంపం

మరోవైపు కార్మికులు క్షేమంగా ఉన్నారని వారికి పైపుల ద్వారా ఆక్సిజన్, విద్యుత్, మందులు, ఆహార పదార్థాలు,నీరు సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు.