
పార్వతీశం, ఐశ్వర్య జంటగా ఎస్ వెంకటరమణ దర్శకత్వంలో సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించిన చిత్రం ‘మెర్సి కిల్లింగ్’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన ఆకాష్ పూరి ‘టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. మోషన్ పోస్టర్‌లో కాన్సెప్ట్ బాగుంది. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. సాయికుమార్, బేబీ హారిక, రామరాజు, ఆనంద్ చక్రపాణి, వీరభద్రం ఇతర పాత్రలు పోషించారు. ఎం.ఎల్.రాజా సంగీతం అందించాడు.