ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేషన్ సులభతరం చేసేలా కొత్త అప్ డేట్

ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేషన్ సులభతరం చేసేలా కొత్త అప్ డేట్

కొత్తగా ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకునేవారి కోసం మెటా సరికొత్త అప్ డేట్ తీసుకొస్తోంది. ఇకపై ఫేస్ బుక్ ప్రొఫైల్ క్రియేషన్ ఈజీ కానుంది. ఇది వరకు ఫేస్ బుక్ లో అకౌంట్ క్రియేట్ చేయాలంటే.. పేరు, వివరాలు, వయసు, అడ్రస్, హాబీలు, ఇష్టమైన ప్రాంతాలు తదితర వివరాలన్నీ నింపాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నింటినీ నింపేందుకు చాలా మంది ఇబ్బంది పడేవారు. అయితే ఇప్పుడు తీసుకొస్తున్న అప్ డేట్ ద్వారా ఇకపై ఆ వివరాలేవీ నింపనవసరం లేదని మెటా ప్రకటించింది.

ప్రొఫైల్లో మతపరమైన, రాజకీయ అభిప్రాయాలతో పాటు ఇతర విద్వేషపూరితమైన వివరాలు పెట్టడం వల్ల వయోలేషన్ పెరుగుతోందని మెటా అభిప్రాయపడింది. వ్యక్తుల చిరునామాలు ఉండటం వల్ల యూజర్లకు హాని కలిగే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపింది. అందుకే ఇకపై ఆ వివరాలేవీ కనిపించకుండా కొత్త అప్ డేట్ పనిచేస్తుందని ప్రకటించింది. ఈ క్రమంలో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసేవాళ్లకు ఈ ఆప్షన్స్ కనిపించవు. కొత్త అప్ డేట్కు సంబంధించిన నోటిఫికేషన్లు ఇప్పటికే కొంతమంది యూజర్లకు పంపించారు. ఈ అప్డేట్ డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి రానుంది.