బ్రేకింగ్: ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలు

బ్రేకింగ్: ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలు

ప్రపంచ వ్యాప్తంగా మెటా నెట్ వర్క్  స్తంభించిపోయింది.భారత్ తో పాటు మరి కొన్ని దేశాల్లో   సాంకేతిక సమస్యతో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రమ్  సేవలు నిలిచిపోయాయి. ఒక్క సారిగా నిలిచిపోవడంతో  యూజర్స్ ఇబ్బంది పడుతున్నారు.దీంతో ట్విట్టర్ వేదికగా మెటాకు ఫిర్యాదు చేస్తున్నారు యూజర్లు.  

అరగంట సేపటి నుంచి పనిచేయకపోవడంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది యూజర్లు తమ అకౌటంట్లు హ్యాక్ అయ్యాయా ఏంటని ఫిర్యాదు చేస్తున్నారు..  వీటిపై మెటా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.  ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే లాగౌట్ అయినట్లు చూపిస్తుందని పోస్ట్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఫేస్ బుక్, ఇన్ స్టా ట్రెండింగ్ లో ఉన్నాయి.  ఎక్కవ సేపు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్  సేవలు నిలిచిపోవడం  2024లో ఇప్పటి వరకు  ఇదేపెద్ద అంతరాయం.