మహాలక్ష్మి స్కీంను సద్వినియోగం చేసుకోవాలి : డీఎం వేదవతి

మహాలక్ష్మి స్కీంను  సద్వినియోగం చేసుకోవాలి : డీఎం వేదవతి

మెట్ పల్లి, వెలుగు: మహాలక్ష్మి స్కీం ద్వారా శనివారం నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం అవుతుందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెట్ పల్లి డీఎం వేదవతి అన్నారు. శుక్రవారం డిపోలో ఉద్యోగులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఆధార్ కార్డు తప్పకుండా కండక్టర్లకు చూపాలన్నారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చన్నారు.