ముంబైతో మ్యాచ్..టాస్ గెలిచిన చెన్నై

V6 Velugu Posted on Sep 19, 2021

ఐపీఎల్ సెకండ్ పేజ్ ఇవాళ్టి నుంచి ప్రారంభ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. దుబాయ్ వేదిక‌గా  ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జ‌రుగుతుంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వికెట్ బాగుందని, తొలుత బ్యాటింగ్ చేసి భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించేందుకే బ్యాటింగ్ ఎంచుకున్నట్టు ధోనీ తెలిపాడు. ఒకసారి మ్యాచ్‌లు ప్రారంభమైతే అన్నీ అవే సర్దుకుంటాయన్నాడు. శామ్ అందుబాటులో లేడని, ఫా డుప్లెసిస్, మొయీన్ అలీ, బ్రావో, జోష్ హాజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో ఆడుతున్నట్టు చెప్పాడు. 


ముంబై ఇండియన్స్‌కు కీరన్ పొలార్డ్ కెప్టెన్ గా ఉన్నాడు. టాస్ ఓడినందుకు బాధగా ఉందన్నాడు. రోహిత్ బాగానే ఉన్నాడని, తాను ఈ ఒక్క మ్యాచ్  కే కెప్టెన్ గా ఉంటానన్నాడు. రోహిత్ ఈ మ్యాచ్ ను మిస్సవుతున్నాడని, హార్దిక్ ఆడడం లేదని చెప్పాడు.  ఈ మ్యాచ్ తో అన్ మోల్ ప్రీత్ అరంగేట్రం చేస్తున్నాడు. మిగతా వారందరూ రెగ్యులర్ ప్లేయర్లే.

Tagged chennai, ipl, toss, MI vs CSK,

Latest Videos

Subscribe Now

More News