Cricket World Cup 2023: కోహ్లీ వరల్డ్ కప్ ఫైనల్లో డకౌట్ కావాలి: ఆసీస్ మాజీ కెప్టెన్

Cricket World Cup 2023: కోహ్లీ వరల్డ్ కప్ ఫైనల్లో డకౌట్ కావాలి: ఆసీస్ మాజీ కెప్టెన్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రౌండ్ లో కుదురుకుంటే పరుగులే కాదు సెంచరీలు కూడా అలవోకగా కొట్టేస్తాడు. ఇంతటి స్టార్ బ్యాటర్ డకౌట్ కావాలని ప్రత్యర్ధులు కోరుకుంటే తప్పు లేదు. కానీ రిటైర్మెంట్ ప్రకటించిన ఒక ప్లేయర్ ఈ కామెంట్స్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. అతడెవరో ఆస్ట్రేలియా జట్టుకి 2015లో వరల్డ్ కప్ అందించిన మైకేల్ క్లార్క్. 

ప్రస్తుతం చెపాక్ వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధ్య వరల్డ్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా గెలవడం కోసం విరాట్ కోహ్లీ డకౌట్ కావాలని మైకేల్ క్లార్క్ కోరుకున్నాడు. బొరియా మజూందార్‌ షోలో క్లార్క్‌ మాట్లాడుతూ.. ‘‘ ఆస్ట్రేలియాతో మ్యాచులో కోహ్లీ డకౌట్ అయితే చూడాలని ఉంది. మిగిలిన మ్యాచుల్లో సెంచరీ కొట్టిన పర్లేదు. ఒకవేళ ఆస్ట్రేలియా ఫైనల్ కి వస్తే మళ్ళీ డకౌట్ కావాలని కోరుకుంటా" అని చెప్పుకొచ్చాడు. 

ఇదిలా ఉండగా.. ఇప్పుడు క్లార్క్ చేసిన కామెంట్స్ కి విరాట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చెత్త మాటలు మాట్లాడకు. మీ జట్టు గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదు. అంతేగాని మా కింగ్ డకౌట్ అవ్వాలని పిచ్చి వాగుడు వాగొద్దు. అని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తానికి తన మనసులో మాట బయట పెట్టి కోహ్లీ ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు క్లార్క్.

ALSO READ : 2023 : ఇందిర ఏకాదశి రోజు అక్టోబర్ 10.. ఈ 5 కార్యాలు చేస్తే.. మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి

 
ఇక ఈ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న మ్యాచులో కోహ్లీ అదరగొడుతున్నాడు. 3 ఫోర్లతో 37 పరుగులు చేసిన విరాట్.. భారత్ ని విజయం వైపుకి నడిపిస్తున్నాడు. కాగా..  ఈ మ్యాచులో భారత్ స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోగా.. రాహుల్, కోహ్లీ అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో భారత్ ని ఆదుకున్నారు.