
లెజెండరీ పాప్ స్టార్, మ్యూజిక్ ఫినామినన్ అయిన మైకేల్ జాక్సన్ పేరు వినగానే… మ్యూజిక్ లవర్స్ తమ మనసులోనే స్టెప్పులేస్తుంటారు. జాక్సన్ మేనియా వచ్చే మార్చిలో ఇండియ మ్యూజిక్ వరల్డ్ ను షేక్ చేయబోతోంది. అమెరికాలో ‘అయామ్ కింగ్ : ద మైకేల్ జాక్సన్ ఎక్స్ పీరియెన్స్’ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్.. అభిమానులను, సంగీత ప్రియులను ఇప్పటికే ఉర్రూతలూగించింది. వచ్చే మార్చిలో ఇండియాలో మైకేల్ జాక్సన్ స్మారక మెగా మ్యూజికల్ షో నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు.
మార్చి 13 నుంచి 17 వరకు.. ముంబై, బెంగళూరుల్లో మైకేల్ జాక్సన్ మ్యూజిక్ షో నిర్వహిస్తారు. ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ ద పెర్ఫామింగ్ ఆర్ట్స్ ఆడిటోరియంలో… ఏడు షోలు వేస్తారు. బ్యాడ్, బిల్లీ జీన్, థ్రిల్లర్, హ్యూమన్ నేచర్ ఆల్బమ్స్ సహా…. మైకేల్ జాక్సన్ చేసిన పాపులర్ హిట్స్ ను జాక్సన్ అభిమానులు, డాన్సర్స్ ప్రదర్శిస్తారు.
లాస్ వెగాస్ సహా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో నగరాల్లో “అయామ్ కింగ్ : ద మైకేల్ జాక్సన్ ఎక్స్ పీరియన్స్” మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. టాలెంటెడ్ మ్యూజీషియన్స్, బ్రాడ్ వే అండ్ లాస్ వెగాస్ డాన్సర్స్ ఈ షోలో సందడి చేస్తారు. మైకేల్ జాక్సన్ లుక్కు, స్టైల్ గుర్తుకు తెచ్చేలా… ఫైర్ స్టోన్ సంస్థ ఈ షోను లీడ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఈవెంట్ … ఫ్యాన్స్, క్రిటిక్స్ నుంచి భారీస్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది.