50 అడుగుల క్లాత్పై కాఫీ పౌడర్తో వెంకటేశ్వరస్వామి చిత్రం

50 అడుగుల క్లాత్పై కాఫీ పౌడర్తో వెంకటేశ్వరస్వామి చిత్రం
  • ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మైక్రో ఆర్టిస్ట్ చిరంజీవి పేరు నమోదు

తిరుపతి జిల్లా: కాఫీ పౌడర్ తో 50 అడుగుల క్లాత్ పై వెంకటేశ్వరస్వామి చిత్రాన్ని వేసిన యువకుడి పేరు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది. తిరుమలకు చెందిన చిరంజీవి మైక్రో ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాడు. బియ్యం, చింతగింజలపై అమ్మవార్ల బొమ్మలు, జాతీయ నేతల బొమ్మలు కూడా చిరంజీవి చిత్రీకరిస్తాడు. 
ఈ నెల 27 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో 50 అడుగుల క్లాత్ పై కాఫీ పౌడర్ తో శ్రీవారి చిత్రాన్ని గీశాడు. 20 రోజులపాటు శ్రమించి 7 కేజీల కాఫీ పౌడర్ తో చిత్రాన్ని గిశాడు. స్వామి వారి ఆశీస్సులతోనే చిత్రాన్ని గీశానని చిరంజీవి తెలిపారు.