తెలుగు రాష్ట్రాల్లో మైక్రో లోన్ల హవా..వ్యక్తిగత హోదాలో భారీగా అప్పులు

తెలుగు రాష్ట్రాల్లో మైక్రో లోన్ల హవా..వ్యక్తిగత హోదాలో భారీగా అప్పులు
  • ట్రాన్స్​యూనియన్​ సిబిల్ ​వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో మైక్రో బిజినెస్ లోన్ మార్కెట్ దూసుకెళ్తోంది. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌యూనియన్  సిబిల్,  ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఐసీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో గురువారం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి తెలంగాణలో రూ.1.74 లక్షల కోట్లు, ఏపీలో రూ.1.45 లక్షల కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. వ్యాపార సంస్థల కంటే వ్యక్తిగత హోదాలో లోన్లు తీసుకునే  వ్యాపారవేత్తల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 3 ఏళ్లలో ఈ వ్యక్తిగత వ్యాపార రుణాలు తెలంగాణలో 26 శాతం, ఏపీలో 25 శాతం వృద్ధి చెందాయి. తెలంగాణలో 19.6 లక్షల మంది, ఏపీలో 23.8 లక్షల మంది, వ్యాపార సంస్థల పేరుతో కాకుండా వ్యక్తిగతంగా రుణాలు తీసుకున్నారు. వీరిలో అత్యధికులకు మంచి సిబిల్ స్కోరు ఉంది. ఆస్తుల తాకట్టు ద్వారా తీసుకునే రుణాలు ఈ 2 రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి.