- పెంపుడు జంతువులకూ అనుమతి
న్యూఢిల్లీ: రవాణా సేవలు అందించే ఉబర్ తన 20 లక్షల మంది డ్రైవర్ల భద్రత, ఆదాయం పెంచే లక్ష్యంతో సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ట్రిప్ వీడియో రికార్డింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. వివాదాలు తలెత్తినప్పుడు వీటిని విచారణ అధికారులు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. కస్టమర్ల నుంచి అసభ్యకరమైన సందేశాలు వస్తే డ్రైవర్లు రైడ్‌ను రద్దు చేయవచ్చు.
అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సేవలను పొందవచ్చు. ఉబర్ బైక్ సేవలను నగరాల మధ్య ప్రయాణాలకు కూడా విస్తరించింది. పార్సిల్ డెలివరీలు , కార్లలో పెంపుడు జంతువులను అనుమతించడం ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాలను డ్రైవర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇతర డ్రైవర్లను సంస్థలో చేర్పించిన వారికి ఇన్సెంటివ్స్ ఇస్తామని ఉబర్ ప్రకటించింది.
