టిక్ టాక్ యూజ‌ర్ల‌కు మైక్రోసాఫ్ట్ శుభ‌వార్త ..! భార‌త్ లో టిక్ టాక్..?

టిక్ టాక్ యూజ‌ర్ల‌కు మైక్రోసాఫ్ట్  శుభ‌వార్త ..! భార‌త్ లో టిక్ టాక్..?

టిక్ టాక్ యూజ‌ర్ల‌కు టెక్ దిగ్గ‌జం మైక్రోసాప్ట్ శుభ‌వార్త చెప్పింది. త్వ‌ర‌లో టిక్ టాక్ ను కొను‌గోలు చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది.

గ‌తంలో భార‌త ప్ర‌భుత్వం దేశ భ‌ద్ర‌త దృష్ట్యా చైనాకు చెందిన యాప్ ల‌ను డిలీట్ చేసింది. వాటిలో వీడియో ఫ్లాట్ ఫామ్ టిక్ టాక్ కూడా ఉంది. అయితే భార‌త్ లో చైనా యాప్స్ బ్యాన్ చేయ‌డంతో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం చైనా యాప్స్ పై నిషేదం విధించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. దీంతో కంగుతిన్న టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ త‌న సంస్థ‌ను అమ్మ‌కానికి పెట్టింది. భార‌త్ , అమెరికాతో పాటు మిగిలిన దేశాల్లో టిక్ టాక్ బ్యాన్ చేసే ప్ర‌మాదం ఉంద‌ని భావించిన బైట్ డ్యాన్స్ టిక్ టాక్ ను మైక్రోసాఫ్ట్ కు అమ్మేందుకు సిద్ధ‌మైంది.

అయితే టిక్ టాక్ ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయ‌డాన్ని డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోలేద‌నే ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ఆ ప్రచారానికి మైక్రోసాఫ్ట్ చెక్ పెడుతూ సెప్టెంబ‌ర్ 15లోగా టిక్ టాక్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది.

టిక్ టాక్ ను కొనుగోలుకు  ముందు మైక్రోసాప్ట్ సీఈఓ స‌త్య‌నాదెండ్ల, అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతార‌ని తెలిపింది.

అమెరికా పౌరుల డేటాకు విఘాతం కలగకుండా చూస్తామని హామీ ఇస్తూ, ఆర్థిక లాభం చేకూరేలా చేస్తామని మైక్రోసాప్ట్ ప్రకటించింది. ఒకవేళ ఇప్పటికే సమాచారం ఇతర సర్వర్లలోకి వెళ్లి ఉంటే వాటిని శాశ్వతంగా తొలగిస్తామని చెప్పింది.

అమెరికాలో టిక్ టాక్

అమెరికాలో టిక్ టాక్ బ్యాన్ చేయ‌నున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు. అయితే మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన అనంత‌రం టిక్ టాక్ కార్య‌కలాపాల‌ను కొన‌సాగించేలా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ టిక్ టాక్ ను కొనుగొలు చేస్తే యూఎస్ , కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ తో సహా ఇత‌ర దేశాలలో టిక్ టాక్ కార్య‌క‌లాపాల్ని నిర్వ‌హించేలా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య ‌నాదెండ్ల ప్లాన్ చేస్తున్న‌ట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు.

భార‌త్ లో టిక్ టాక్..?

టిక్ టాక్ తాము కొనుగోలు చేస్తున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ ప్ర‌క‌టించ‌డంతో భార‌త్ లో ఉన్న టిక్ టాక్ యూజ‌ర్లు సంతోషం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. టిక్ టాక్ తో ఎంట‌ర్ టైన్మెంట్, ఉపాధి పొందుతున్న క్రియేట‌ర్స్ భార‌త్ లో త‌న సే వ‌ల్ని పున ప్రారంభించాల‌ని కోరుతున్నారు. మైక్రోసాఫ్ట్ టిక్ టాక్ ను కొనుగోలు చేసిన అనంత‌రం ఆ సంస్థ కేంద్రంతో మాట్లాడితే ..త‌న కార్య‌క‌లాపాల్ని భార‌త్ లో కొన‌సాగించే అవ‌కాశం ఉంది. అప్ప‌టి వ‌ర‌కు యూజ‌ర్స్ ఎదురు చూడాల్సిందే.