గూగుల్ కి పోటీగా మైక్రోసాఫ్ట్ యాప్

గూగుల్ కి పోటీగా మైక్రోసాఫ్ట్ యాప్

యాపిల్  సిరి, గూగుల్ కి పోటీగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ తీసుకురానుంది. సూపర్ యాప్ పేరుతో కొత్త సెర్చ్ ఇంజిన్ ని లాంచ్ చేయబోతుంది. కంటెంట్ సెర్చ్ చేయడానికి మాత్రమే కాదు.. ఈ యాప్ తో మెసేజింగ్, షాపింగ్, న్యూస్ కంటెంట్ సెర్చ్ కూడా చేయొచ్చు.

అయితే.. ఇదివరకే మైక్రోసాఫ్ట్ కు సొంత సెర్చ్ ఇంజిన్ బింజ్ ఉండగా, దాని పాపులారిటీ గూగుల్, సిరికి ఉన్నంత లేదు. అందుకే సూపర్ యాప్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బింజ్ యాప్ పాపులారిటీ పెంచడానికి, సూపర్ యాప్ ని డెవలప్ చేయడానికి మైక్రోసాఫ్ట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.