సమస్యలు తీర్చేదాక సమ్మె ఆపేదిలేదు : పోలే సత్యనారాయణ

సమస్యలు తీర్చేదాక సమ్మె ఆపేదిలేదు : పోలే సత్యనారాయణ

నల్గొండ అర్బన్, హుజుర్ నగర్, వెలుగు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు తీర్చేవరకు సమ్మె ఆపేది లేదని మధ్యాహ్న భోజన పథకం యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే సత్యనారాయణ హెచ్చరించారు.  సమ్మెలో భాగంగా శుక్రవారం నల్గొండ డీఈవో కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.  

హుజుర్ నగర్‌‌లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీలం శ్రీను ఆధ్వర్యంలో  అంబేద్కర్‌‌ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ పెంచుతున్నట్లు ప్రకటించిన వేతనాలు ఇప్పటి వరకు అకౌంట్‌లో వేయలేదన్నారు.  పెంచిన వేతనాన్ని ఏరియర్స్ తో సహా కలిపి చెల్లించాలని, వంటకు సరిపడా గ్యాస్, ప్రమాద బీమా సౌకర్యం, గుర్తింపు కార్డులను ఇవ్వాలని కోరారు. 

విద్యార్థులకు అల్పాహారం సంతోషకరమే కానీ తమపై అదనపు భారం పడుతుందన్నారు. 10 గంటలు పని చేయాల్సిన పరిస్థితి ఉంటుందని, ఇందుకు తగ్గట్టుగా కనీస వేతనం నిర్ణయించాలని కోరారు.  కొత్త మెనూకు బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో యూనియన్ నాయకులు పోలగాని యాదమ్మ, అనురాధ, దొడ్డి ఆండాలు, కిన్నెర సైదమ్మ, దండ పుష్పలత, వేముల ఇందిర, బొజ్జ అలివేలు, రమణమ్మ, ఉమా, మహేశ్వరి, జానమ్మ, పద్మ, రూతు, వెంకటమ్మ, భిక్షమమ్మ, అనసూర్య, ప్రమీల, నాగమ్మ, రేణుక, అండాలు, ముత్తమ్మ, మాణిక్య తదితరులు పాల్గొన్నారు.