గణేశ్​ మండపం వద్దే .. సర్కారీ బడి విద్యార్థుల భోజనం

గణేశ్​ మండపం వద్దే .. సర్కారీ బడి విద్యార్థుల భోజనం

సుల్తానాబాద్, వెలుగు : మధ్యాహ్న భోజన నిర్వాహకులకు రాష్ట్ర సర్కారు బిల్లులు చెల్లించకపోవడంతో బడుల్లో స్టూడెంట్స్​కు భోజనం కరువైంది. దీంతో వారికి వినాయక మండపాలే దిక్కయ్యాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​లోని స్థానిక గాంధీ నగర్  మండపం వద్ద ఏడు రోజులుగా అన్నదానం చేస్తుండగా పక్కనే ఉన్న జడ్పీ హైస్కూల్  పిల్లలు రోజూ ఇక్కడే తింటున్నారు. మంగళవారంతో అన్నదాన కార్యక్రమం ముగియగా విద్యార్థులకు మళ్లీ బువ్వ తిప్పలు మొదలుకాబోతున్నాయి.