
కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. మూల, మానేరు, గంజి వాగుల ద్వారా ప్రాజెక్టుకు51 వేల 97 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 920 అడుగులు.. కాగా .. ప్రస్తుత నీటిమట్టం 906 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిలో సామర్థ్యం 24.034 టీఎంసీలు .. అయితే ప్రస్తుత నీటి నిల్వ 13.652 టీఎంసీలకు చేరింది.
లోయర్ మానేరు గేట్ల ద్వారా 43 వేల క్యూసెక్కులు, మోయ తుమ్మెద వాగు ద్వారా 8, 097 క్యూసెక్కుల వరద ఎల్ఎండిలోకి వదులుతున్నారు. మిషన్ భగీరథ అవసరాల కోసం 260 క్యూసెక్కులను విడుదల చేశారు.
Also read:-తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు... కామారెడ్డి జిల్లా అతలాకుతలం..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యామ్ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇంకా డ్యామ్ నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.