ఐఏఎఫ్‌ ఫైటర్‌‌ జెట్‌ క్రాష్‌

ఐఏఎఫ్‌ ఫైటర్‌‌ జెట్‌ క్రాష్‌
  • పంజాబ్‌లో ఘటన
  • సురక్షితంగా బయటపడ్డ పైలెట్

సింగ్‌నగర్‌‌: ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన మిగ్‌ – 29 ఫైటర్‌‌ జెట్‌ క్రాష్‌ అయింది. పంజాబ్‌ షాహీద్‌ భగత్‌ సింగ్‌ నగర్‌‌ తాలూకు ఛుహాద్‌పూర్‌‌ గ్రామంలో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ప్రమాదం జరిగిందని సీనియర్‌‌ ఎస్పీ అల్కా మీణా చెప్పారు. హోషియాపూర్‌‌ జిల్లా రౌర్కీ నుంచి బయలుదేరిన ఫ్లైట్‌ కొద్దిసేపటికే కుప్పకూలిపోయిందని అధికారులు చెప్పారు. పైలెట్‌ సురక్షితంగా బయటపడ్డాడని, అతనికి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నామన్నారు. టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ వల్ల ప్రమాదం జరిగిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని సీనియర్‌‌ అధికారి ఒకరు చెప్పారు.