బైకులపై వచ్చి 20 మంది సైనికులు, 40 మంది పౌరులను చంపిన ఉగ్రవాదులు

బైకులపై వచ్చి 20 మంది సైనికులు, 40 మంది పౌరులను చంపిన ఉగ్రవాదులు

ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది సైనికులు మరియు 40 మంది పౌరులు చనిపోయారు. ఈ దారుణ దాడి ఈశాన్య నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో శనివారం జరిగింది. గుబియోలోని ఒక గ్రామంపై దాడిచేసి 69 మందిని చంపిన కొద్దిరోజులకే ఈ దాడులు జరగడం గమనార్హం. శనివారం ఉదయం 11 గంటలకు రాకెట్ లాంచర్లు, భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు మొంగునో మరియు న్గాన్జాయ్ ప్రాంతాలలోకి బైకులు మరియు ట్రక్కుల మీద వచ్చారు. ఈ ప్రాంతాలలో విచక్షణా రహితంగా కాల్సులు జరిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు కూడా నిప్పంటించారు. అదే ప్రాంతంలో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయాన్ని కూడా తగలబెట్టారు. సైనికులు, ప్రభుత్వ అధికారులు, వైట్ క్రిస్టియన్స్, మరియు ఇతర మతాల వారితో కలిసి పనిచేయవద్దని హెచ్చరిస్తూ ఉగ్రవాదులు లేఖలు పంపిణీ చేశారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది సైనికులు, 40 మంది పౌరులు చనిపోయినట్లు సివిలియన్ టాస్క్ ఫోర్స్ ఫైటర్ కు చెందిన అధికారి తెలిపారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రి మొత్తం క్షతగాత్రులతో నిండిందని ఆయన తెలిపారు.

For More News..

మూడు నెలల ఫీజు మాఫీ చేసిన ప్రైవేట్ స్కూల్

అమెరికాలో ఎతైన హనుమాన్ విగ్రహం

తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు