
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండల పరిధి ముచ్చింతల గ్రామంలోని శ్రీరామ నగరంలో మంగళవారం జీయర్ స్వామి వారి ఆశ్రమం (జీవా క్యాంపస్) నందు కృష్ణా మిల్క్ యూనియన్, విజయ పాల ఉత్పత్తుల సెంటర్‌ను త్రిదండి చిన రామానుజ జీయర్ స్వామి ప్రారంభించారు. చిన జీయర్ స్వామి మాట్లాడుతూ.. పాడి పశువుల పెంపకం పవిత్రమైన వృత్తి అన్నారు. పాడి రైతులకు, పశు సంపదకు కృష్ణా మిల్క్ యూనియన్ దేశంలోనే గొప్ప సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు పాడి రైతుల సంక్షేమం కోసం చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కొల్లి ఈశ్వర బాబు, పాలక వర్గ సభ్యులు దాసరి వెంకట బాల వర్ధన రావు, ఉయ్యూరు అంజి రెడ్డి, అర్జా వెంకట నగేష్ పాల్గొన్నారు.