వీటితో చిరాకు దూరం అవ్వాల్సిందే..

వీటితో చిరాకు దూరం అవ్వాల్సిందే..

మూడ్ బాగుంటేనే స్నేహ బంధాలు , వర్క్ రిలేషన్స్​ బాగుంటాయి.అయితే డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి లాంటి విదూరం కావాలంటే విటమిన్స్​ పుష్కలంగా ఉండే ఆహారంతో పాటు ట్యాబెట్లు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

ఒమెగా–3ఎస్

మనిషి మెదడును ప్రభావితం చేయడంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా పనిచేస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నా యి.కాబట్టి ఒమెగా–3 ఎస్ సంప్లిమెంట్స్ అందిస్తే మెదడు చురుగ్గా పని చేస్తుం ది. చేపల్లో ఒమెగా 3 ఎస్ పుష్కలం. అయితే, చేపలు తినని వాళ్లు చేప నూనె వాడొచ్చు. చేపలతోపాటు బాదం, పిస్తా, వాల్ నట్స్, చియా, దోసగిం జల్లో ఒమెగా–3 ఎస్ సప్లిమెంట్స్ లభిస్తాయి.

విటమిన్ బి3

దీన్నే ‘నియాసిన్’ అని కూడా అంటారు. ఇదిసెరటోనిన్ ఉత్పత్తిపై ప్రభావితం చూపుతుంది.సెరటోనిన్ రక్తకణాలు, సీరంలో ఉంటుంది. దీనివల్లే మెదడు నుంచి వచ్చే సంకేతాలు శరీరంలోని నాడీ వ్యవస్థకు చేరతాయి. ఇదిలోపిస్తే డిప్రెషన్ కు గురవుతారు. మెదడు చురుకుదనం తగ్గుతుంది. అయితే, డిప్రెషన్ తీవ్రతను బట్టి ‘విటమిన్ బి3’ ప్రతి రోజు కనీసం20 ఎంజీ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నా రు.

విటమిన్ బి6

శారీరక, మానసిక పనితీరు మీద ప్రభావంచూపడంలో ‘విటమిన్ బి6’ కీలకంగా పని చేస్తుంది. మహిళల్లో రుతుక్రమాన్నిబ్యాలెన్స్ చేయడంలోనూ తోడ్పడుతుంది.పిల్లలు పుట్టకుండా మాత్రలు వాడే వాళ్లలో ‘బివిటమిన్’ తీవ్రంగా లోపిస్తుం ది. ముఖ్యం గా‘బి 6’ స్థా యిలు బాగా పడిపోతాయి. కాబట్టి ఆసమయంలో ‘బి 6’ సప్లిమెంట్స్ బాగా అవసరం.ట్యాబ్లెట్ల రూపంలో వీటిని నిత్యం 25 ఎంజీచొప్పున తీసుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

విటమిన్ బి12

మెదడు పనితీరు, చురుకుదనాన్ని పెంచడంలో‘విటమిన్ బి12’ బాగా ఉపయోగపడుతుంది.దీన్ని సమృద్ధిగా తీసుకున్నవాళ్లకు డిప్రెషన్ సమస్య ఉండదు. ‘బి-12’ లోపం ఉన్నవాళ్లు ప్రతిరోజు10 ఎంజీ చొప్పున ‘బి -కాంప్లెక్స్ ’ట్యాబ్లెట్లు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.‘బి 12 విటమిన్’ను భర్తీ చేయాలంటే లివర్, చేప పిల్లలు, గొర్రె మాంసం, గుడ్లు, వెన్నతీసుకోవాలి.

విటమిన్ సి

పెద్దవాళ్ల మెదడు పనితీరు మీద ‘విటమిన్–సి’బలంగా పని చేస్తుం ది. ఇది లోపిస్తే డిప్రెషన్,ఆందోళన లాంటి సమస్యలొస్తాయి. ఇది నీళ్లలోకరిగే విటమిన్ కాబట్టి శరీరంలో నిల్వ ఉండదు.కాబట్టి ప్రతిరోజూ ‘విటమిన్–సి’ తీసుకోవాలి.100 ఎంజీ నుం చి 2000 ఎంజీ వరకుతీసుకోవచ్చు. అయితే, మోతాదు మిం చితే  డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. విటమిన్–సిముఖ్యంగా నిమ్మజాతి పండ్లలో పుష్కలంగా ఉంటుం ది.

విటమిన్ డి

మనిషి మెదడు మీద ప్రభావం చూపడంలో‘డి’ విటమిన్ చాలా కీలకం. ఆరోగ్యం మీదశ్రద్ధ చూపుతూ.. ఖరీదైన ఫుడ్ తీసుకుంటున్నచాలా మంది విటమిన్ ‘డి’ని మర్చి పోతున్నా రు. సూర్యకాంతి ని సక్రమంగా వినియోగిం చుకోలేకచాలా మంది డిప్రెషన్ కు గురవుతున్నా రు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం అమెరికాలోని 75 శాతం మంది ప్రజలు‘విటమిన్–డి’ లోపంతో బాధపడుతున్నా రు.మన దేశంలోనూ చాలా మంది ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నా రు. వాళ్లలో పెద్దలతోపాటు యువత కూడా ఉంది. శరీరం మీద పడే సూర్యకాంతిని మెదడు గ్రహించి.. జ్ఞాపకశక్తి,మేధాశక్తి, చురుకుదనం లాంటి లక్షణాలను మెరుగుపరుచుకుంటుంది. అంతేకాదు‘విటమిన్ –డి’ ఎముకలు, దంతాల పటిష్టతకు మేలు చేస్తుంది. ‘డి–విటమిన్’ కోసం ప్రతిరోజు ఇరవై నిమిషాల పాటు సూర్యకాంతి తగిలేలా చూసుకుంటే చాలు.

ఫోలిక్ యాసిడ్

ఫోలేట్ దీన్నే ‘ఫోలిక్ యాసిడ్’ లేదా ‘విటమిన్బి–9’ అని పిలుస్తారు. శరీరంలో కొత్త రక్తకణాలు ఉత్పత్తి కావడానికి ఇది తోడ్పడుతుం ది.గర్భిణులు ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వాలన్నా , కాన్పు సజావుగా జరగాలన్నా‘విటమిన్ బి–9’ సమృద్ధిగా ఉండాలి. ఫోలిక్యాసిడ్.. న్యూరో ట్రాన్స్​మీటర్​గా పనిచేసే సెరటోనిన్ ఉత్పత్తిని సమతుల్యం చేయడంతోపాటు మంచి మూడ్ ని నియంత్రణలో ఉంచుతుంది. డాక్టర్ల సూచన మేరకు ప్రతి రోజు400 ఎంసీజీ ఫోలిక్ యాసిడ్ తీసుకోవచ్చు.

మెగ్నీషియం

మెదడు రిలాక్స్ కావడానికి మెగ్నీషియం చాలా అవసరం. అలాగే కండరాలుబిగుసుకుపోవడం, అజీర్తి లాంటి సమస్యలురాకుండా మెగ్నీషియం ఉపయోగపడుతుంది.ముడి ధాన్యం , ఎండబెట్టిన బీన్స్, నట్స్,ముదురు ఆకు పచ్చ గింజ ధాన్యాల్లో ఇది పుష్కలంగా దొరుకుతుంది. తక్షణ ఫలితానికి 320 నుం చి 450 ఎంజీ చొప్పున మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నా రు.

ఐరన్

ఐరన్ లోపిస్తే మనిషి శరీరం నిర్వీర్యంఅవుతుం ది. తీవ్రమైన అలసటగా ఉంటుంది. ఏ పనీ చేయాలనిపిం చదు. రుతుక్రమం వల్లమహిళలకు ఐరన్ అవసరం. శరీరంలోసరిపడినంత ఐరన్ ఉంటే మలబద్ధకం సమస్య ఉండదు. ఇది లివర్, పాలకూర, పాలు,డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు, సోయాబీన్స్​లోపుష్కలం.

క్రోమియం

మనిషికి ఇది తక్కువ మోతాదులోనే అవసరంఅయినప్పటికీ.. దీని లోపం కారణంగాబాధపడేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. రక్తంలోని షుగర్ లెవెల్స్​ని సమతుల్యం గాఉంచడం ద్వారా మూడ్ ని ప్రభావితం చేస్తుంది. సెరటోనిన్, మెలటోనిన్ లాంటిబ్రెయిన్ కెమికల్స్ ఉత్పత్తికి క్రోమియందోహదపడుతుం ది. మాంసం, ఆలుగడ్డల్లో ఇదిఎక్కువగా లభిస్తుం ది.

ఎల్-థియానిన్

శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తి పెరగడానికి,మెదడులో ఆల్ఫావేవ్స్ పెరుగుదలకు కారణమైన అమైనో యాసిడ్స్.. గ్రీన్ టీలో పుష్కలంగాఉన్నా యని అనేక పరిశోధనల్లో తేలిం ది.నరాలను ఉత్తేజపరిచే ఆర్గానిక్ కాం పౌండ్స్​నే‘ఎల్-థియానిన్’గా పిలుస్తారు.కాబట్టి ప్రతిరోజూ గ్రీన్ టీ తీసుకుంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధి చెంది.. మెదడు చురుగ్గా ఉంటుంది.