ప్రాణహిత చేవెళ్ల మేమే పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

ప్రాణహిత చేవెళ్ల మేమే పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

త్వరలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  తమ హయాంలోనే ప్రాణహిత చేవెళ్ల  పూర్తి చేస్తామని చెప్పారు. నిజామాబాద్ లో జరిగిన రైతు మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఉత్తమ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నిజాంసాగర్,ఎస్ఆర్ఎస్పీ నుంచి అదనపు ఆయకట్టు తీసుకొస్తామని చెప్పారు. రైతు పక్షపాతంగా కాంగ్రెస్ ఎన్నో నిర్ణయాలు తీసుకుందన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం  కాళేశ్వరంతో లక్ష కోట్ల ఖర్చు చేసి ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చిందని ప్రశ్నించారు ఉత్తమ్. కాళేశ్వరంలో బ్యారేజీలు కూలినా..రికార్డ్ స్థాయిలో వరి సాగైందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో కూడ ఇంత స్థాయిలో పంట పండలేదన్నారు . తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందన్నారు. ఏ ధాన్యం కొనుగోలు సెంటర్లో గన్నీ బ్యాగ్స్ కొరత లేదన్నారు. రైతు పండించిన ప్రతీ గింజకు మద్దతు ధర చెల్లిస్తున్నామని చెప్పారు. సన్న వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు.