
వేములవాడ, వెలుగు: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కు చెల్లించారు. అనంతరం కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు.
ఆలయ ఈవో రాధాబాయి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కులదైవం, ఇలవేల్పు అయిన రాజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సహాయ ఈవో శ్రవణ్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ, టెంపుల్ పరిశీలకులు నరేందర్, ప్రోటోకాల్ సీనియర్ అసిస్టెంట్ మహేశ్, జూనియర్ అసిస్టెంట్ సింహాచార్యులు పాల్గొన్నారు.