అంబటిపై నెట్టింట్లో దారుణంగా ట్రోలింగ్

అంబటిపై నెట్టింట్లో దారుణంగా ట్రోలింగ్
  • ఏపీలో తెరపైకి మరో వివాదం
  • జూ.ఎన్టీఆర్ కి మంత్రి క్షమాపణ చెప్పాల్సిందే ఫ్యాన్స్ డిమాండ్
  • వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలి
  • సోషల్ మీడియాలో అంబటిపై దారుణంగా ట్రోలింగ్

ఏపీలో రోజుకో అంశం వివాదం కావడం కొత్తేమీ కాదు. మొన్నటి వరకూ రాజకీయ నాయకుల గొడవలు, ఆ తర్వాత స్త్రీలపై అఘాయిత్యాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కాగా ప్రస్తుతం మరో అంశం తెరమీదకొచ్చింది. ఈ ఘటనతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నాయకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

మంత్రి అంబటి రాంబాబు ఇటీవలి కాలంలో జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ ను ఉద్దేశించి.. ఆయన జూనియర్ ఎన్టీఆర్ కాదు.. బోనియర్ ఎన్టీఆర్ అంటూ కామెంట్ చేయడంపై ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మంత్రి నోటి దురుసుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ కామెంట్స్ చేయడం వెనుక కారణమేమంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు గుప్పించిన మంత్రి అంబటి రాంబాబు.. ఎమ్మెల్సీ అనంతబాబు వివాదం గురించి మీడియాలో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు, లోకేష్. ఇది మేము అంటున్న మాట కాదు. లోకేష్ బాబు పోతే జూనియర్ ఎన్టీఆర్ లేదా బోనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని టీడీపీ నేతలు అంటున్నారు అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. దీంతో తారక్ ను అవమానించేలా అంబటి మాట్లాడారని, అందుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియా వేదికగా #JaganShouldApologizeJrNTR అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేస్తూ ట్రెండింగ్ లో నిలిచేలా ట్రోల్స్, ట్వీట్స్ చేస్తున్నారు.

 

ఇకపోతే అంబటి రాంబాబు ఓ మహిళతో అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడుతున్న వీడియోను ట్విట్టర్‌లో లీక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను చాలా మంది షేర్ చేయగా.. అంబటి వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో వేదికగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పై వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆ కారణంగానూ ఆయన అభిమానులు అంబటి రాంబాబు వాయిస్ ఉన్న వీడియోను ట్రోల్ చేస్తూ.. తమ అభిమానాన్ని వెళ్లగక్కుతున్నారు.

https://twitter.com/HemanthNBK2/status/1528753572254388224?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1528753572254388224%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.filmibeat.com%2Fnews%2Fjr-ntr-fans-demands-ys-jagan-to-apologize-over-amabati-rambabu-s-objectional-comments-on-tarak-109862.html

దీనికి తోడు గుంటూరు జిల్లా తెనాలిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వైకాపా నేత మధ్య ఇటీవల భారీ గొడవ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున అభిమానులు తెనాలిలో ఫ్లెక్సీలు కట్టడానికి ప్రయత్నిస్తే..  వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. అయితే తాజాగా మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా దీనికి తోడు కావడంతో అగ్ని ఆజ్యం పోసినట్లియింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్‌కు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.


https://twitter.com/lakshmantiger/status/1528921130811084800?s=20&t=O2RDaOrw9REjvTwwT6CBRQ

 

మరిన్ని వార్తల కోసం...

ఏసీబీకి దొరికిన అంతర్గాం తహసీల్దార్

చైనాకు బైడెన్ హెచ్చరికలు