త్వరలో కంకోల్ పీహెచ్సీని ప్రారంభిస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ

త్వరలో కంకోల్ పీహెచ్సీని ప్రారంభిస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ

  సంగారెడ్డి టౌన్ , వెలుగు: కంకోల్ లో కూరగాయల మార్కెట్, పశువుల సంత ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గ్రామానికి చెందిన ప్రతినిధులతో సంగారెడ్డి లోని తన నివాసంలో సమావేశమయ్యారు. 

మంత్రి మాట్లాడుతూ కంకోల్ గ్రామంలో నిర్మిస్తున్న పీహెచ్ సీ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.