
టేక్మాల్, వెలుగు: మండలంలోని బోడ్మట్ పల్లిలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వార్షికోత్సవం వైభవంగా జరుగుతోంది. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తన ప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని వీరభద్ర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ బసవరాజ్ మంత్రిని ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, ఆర్టీఐ మెంబర్ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు మాన్ కిషన్, సాగర్ కిషోర్, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పాపయ్య, భరత్, శంకరప్ప, మహేశ్ రెడ్డి, నరసింహులు, సందీప్ గోపాల్, శ్రావణి పాల్గొన్నారు.