జోగిపేట నుంచి అజ్జమర్రికి రోడ్డు పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహా

జోగిపేట నుంచి అజ్జమర్రికి రోడ్డు  పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహా

సంగారెడ్డి, వెలుగు: జోగిపేట నుంచి అజ్జమర్రి వెళ్లడానికి మంత్రి దామోదర రాజనర్సింహా శుక్రవారం రోడ్డు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దారిలో అడ్డుగా ఉన్న ఏటిపై వంతెన నిర్మిస్తే చిలప్​చెడ్​ మండలంలోని గ్రామాల ప్రజలు వ్యాపారం కోసం జోగిపేటకు సులువుగా రావచ్చన్నారు. అనంతరం జోగిపేటలో  కొత్తగా నిర్మించిన  మార్కెట్​ను పరిశీలించారు. ఇక్కడ నర్సింగ్​ కాలేజ్​ నిర్మిస్తే  ఎలా ఉంటుందో పరిశీలించాలని అధికారులకు సూచించారు.

తర్వాత జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో నిర్మించిన స్టేడియాన్ని పరిశీలించారు. భవనం నిరుపయోగంగా ఉండడంతో స్పోర్ట్స్​ అథారిటీ వారికి లెటర్​ రాసి భవనాన్ని మున్సిపల్​కు అప్పగించాలని ఆర్డీఓ పాండును ఆదేశించారు. గ్రౌండ్​కు పూర్తిస్థాయిలో ప్రహారీ నిర్మించి  గేట్​ ఏర్పాటు చేయాలని ఇద్దరిని సెక్యూరిటీగా నియమించాలన్నారు. మంత్రి వెంట కౌన్సిలర్లు  సురేందర్​గౌడ్​, దుర్గేశ్​, హరికృష్ణ, నాగరాజు, రంగ సురేశ్, అధికారులు పాల్గొన్నారు.