రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : మంత్రి శ్రీధర్ బాబు
  • మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌బాబు అన్నారు.  శుక్రవారం ఆయన మంథని పట్టణంలోని రావుల చెరువుకట్ట గణేశ్‌‌ మండపంలో నిర్వహించిన గణపతి హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్లేలా చూడాలని భగవంతుడిని ప్రార్థించినట్లు చెప్పారు.

రాష్ట్రంలో భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిందని,నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వపరంగా పరిహారం చెల్లించి ఆదుకుంటాం అన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో సీడీపీ నిధులు రూ. 48 లక్షలతో కొనుగోలు చేసిన వైకుంఠరథం, ఫ్రిజర్‌‌‌‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో లీడర్లు వెంకన్న, కాచే, ప్రసాద్, శ్రీనివాస్, సదానందం పాల్గొన్నారు.