మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వివాదాస్పద వ్యాఖ్యలు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వివాదాస్పద వ్యాఖ్యలు
  •      కాంగ్రెస్​, బీజేపోళ్లను దంచండి
  •      వాళ్లు టీఆర్ఎస్​ను విమర్శిస్తే చూస్తూ కూర్చోవద్దు 
  •      వచ్చే ఎన్నికల్లో పార్టీకి 80 సీట్లొస్తయ్​ 
  •      మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు

స్టేషన్ ఘన్​పూర్, వెలుగు:  ‘టీఆర్ఎస్​ పాలనపై బీజేపీ, కాంగ్రెస్​వాళ్లు విమర్శలు చేస్తే వాళ్లను గుంజుకుపోయి గ్రామసభలో కూర్చొబెట్టి టీఆర్ఎస్​ వెల్ఫేర్​ స్కీమ్స్ ​గురించి చెప్పండి. ఆ పిచ్చోళ్లు మాట్లాడుతుంటే టీఆర్ఎస్​ కార్యకర్తలు వింటూ కూర్చోవడం కాకుండా దంచండి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వివాదాస్పద మెంకాట్స్​ చేశారు. జనగామలో వచ్చే శుక్రవారం సీఎం కేసీఆర్​ పర్యటన ఉన్నందున స్టేషన్ ఘన్​పూర్​లో ఎమ్మెల్యే రాజయ్య ఆధ్వర్యంలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి మాట్లాడుతూ 11న జనగామలో కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను సీఎం ప్రారంభిస్తారని, తర్వాత బహిరంగ సభ ఉంటుందన్నారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల బలాలపై సర్వే చేశామని, ఇందులో టీఆర్ఎస్​కు 80 సీట్లు, కాంగ్రెస్​కు , బీజేపీకి చెరో 10 సీట్లు రాబోతున్నాయని తేలిందన్నారు. నాలుగేండ్లలో రాష్ట్రంలోని దళితులందరికీ దళితబంధు అందజేస్తామన్నారు. మార్చి తర్వాత మూడు వేల ఇండ్లు ఇస్తామని, సొంత జాగా ఉన్న పేదలకు ఇండ్లు మంజూరుచేస్తామన్నారు. 

సంజయ్​...నీకు చదువు లేదు...
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి మాట్లాడుతూ ‘బండి సంజయ్​ నీకు చదువులేదు, తెలుగు, ఇంగ్లీషు రాదు, వచ్చేదల్లా చెడుమాటలే’ అని ఎద్దేవా చేశారు. అర్హులైన టీఆర్ఎస్ ​కార్యకర్తలకు డబుల్​ బెడ్​రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​, జనగామ జడ్పీ చైర్మన్ ​పాగాల సంపత్​రెడ్డి, హన్మకొండ జడ్పీ చైర్మన్ ​సుధీర్​, మార్కెట్​కమిటీ చైర్మన్​గుజ్జరి రాజు, సర్పంచుల ఫోరం జిల్లా అధికార ప్రతినిధి సురేశ్​కుమార్​, స్టేషన్​ ఘన్​పూర్​, లింగాలఘనపురం జడ్పీటీసీలు మారపాక రవి, గుడి వంశీధర్​రెడ్డి, కుడా మాజీ డైరెక్టర్​ ఆకుల కుమార్​, టీఆర్​ఎస్​ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్​పాల్గొన్నారు