మృతుడి కుటుంబానికి మంత్రి వివేక్ పరామర్శ

మృతుడి కుటుంబానికి మంత్రి వివేక్ పరామర్శ

పెద్దపల్లి, వెలుగు :  పెద్దపల్లి మాజీ జడ్పీటీసీ బండారు రామ్మూర్తి తండ్రి బండారి రామస్వామి(80) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గనులు, కార్మిక శాఖ మంత్రి  డాక్టర్​గడ్డం వివేక్​ వెంకటస్వామి శనివారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

రామస్వామి చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన వెంట దిశ కమిటీ మెంబర్​సయ్యద్ సజ్జాద్, బాలసాని సతీశ్, ఉనుకొండ శ్రీధర్​పటేల్, బండారు సునీల్ తదితరులు ఉన్నారు.