
నస్పూర్, వెలుగు: రాష్ట్ర కార్మిక, ఉపాధి గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కృషితో గిగ్ వర్కర్లకు న్యాయం జరిగిందని ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు గుమ్మడి శ్రీనివాస్ ఓ ప్రకటనలో అన్నారు.
రాష్ట్రంలోని గిగ్ వర్కర్లను ఇప్పటివరకు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వివేక్వెంకటస్వామి గిగ్ వర్కర్ల వద్దకు వెళ్లి, వారి సమస్యలను తెలుకున్నారని అన్నారు. వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు, నిధులు, ప్రత్యేక పాలసీ తీసుకొచ్చేందుకు కృషి చేయడం అభినందనీ మని అన్నారు.