బిడ్డ అనే పదం వాడితే.. జాగ్రత్త

బిడ్డ అనే పదం వాడితే.. జాగ్రత్త

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి గంగుల కమలాకర్. ఉదయం హుజురాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై సీరియస్ అయ్యారు ఈటల. దీనికి కరీంనగర్ లో ప్రెస్ మీట్ పెట్టి ఈటలకు కౌంటర్ ఇచ్చారు గంగుల. బిడ్డా అంటూ బెదిరిస్తున్నావా..? తాను కూడా బీసీ బిడ్డనే అంటూ ఫైర్ అయ్యారు గంగుల. ఈటల కన్న ఎక్కువ ఆత్మగౌరవం తమకుందన్నారు. పదవుల కోసం పెదవులు మూయనన్న ఈటల మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేసిన తర్వాత కూడా ఎందుకు పదవులు పట్టుకుని వేలాడుతున్నారన్నారు.  ప్రజలంతా నీవెంటే ఉంటే వెంటనే రాజీనామా చేసి... మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు  గంగుల. 


2018లో 55 సీట్లకు మించి టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ఆగడని ఈటల అనేవాడని గంగుల అన్నారు. టీఆర్ఎస్ పతనం కావాలని..సంక్షేమ పథకాలు ఆగిపోవాలని ఈటల కోరుకున్నాడన్నారు. నిలువెళ్లా విషమున్న వ్యక్తి ఈటల..ఆయన తప్పుచేసినట్లు తగిన సాక్షాలున్నాయన్నారు. తనను బిడ్డా అని బెదిరిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు. ఈటల అస్సైన్డ్ భూములు, దేవరాంజల్ భూములపై అక్రమాలు జరిగినట్లు అధికారులు తేల్చారని.. ఈటలకు ఆత్మగౌరవం ఉంటే ఆ భూములన్నీ ప్రభుత్వానికి సరెండర్ చేయాలని సవాల్ విసిరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో సుమారు 30  గ్రానైట్ క్వారీలు తమిళనాడు వాళ్లు  నడుపిస్తుంటే ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు ఆపలేదన్నారు. తమిళనాడు గ్రానైట్ క్వారీలతో ఈటల కుమ్మక్కయ్యారన్నారు.