
కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలంతా నా వెంటనే ఉన్నారని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ..బలవంతంగా బెదిరించి, డబ్బులిచ్చి తమ వైపు తిప్పుకుంటున్నారని ఈటల రాజేందర్ అంటున్నారని..కానీ నాకు అలాంటి అవసరం లేదన్నారు. ఆ మాట వినడంతో బాధ అనిపించిందని.. అక్కడి ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ జండాపై గెలిచారు కాబట్టి వాళ్లంతా మావాళ్లు అంటున్నామన్నారు. ఈటల రాజేందర్ కాంగ్రెస్ గడప.. బీజేపీ గడప తొక్కడంతో మా వాళ్ళు అంతా స్వగృహం టీఆర్ఎస్ కు వచ్చేశారని తెలిపారు. హుజురాబాద్ మున్సిపాలిటీతో పాటు ఎంపీటీసీ సభ్యులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు. కాళేశ్వర జలాలు, 24 గంటలు కరంటు, రైతుబంధు పథకాలను చూసి ఓట్లు వేశామని ప్రజలు చెబుతున్నారన్నారు. అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజా ప్రతినిధులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు మంత్రి గంగుల కమలాకర్.