మా కోసం ఐదు నెలలు పనిచేస్తే..మీ కోసం ఐదేళ్లు పనిచేస్త: గంగుల

మా కోసం ఐదు నెలలు పనిచేస్తే..మీ కోసం ఐదేళ్లు పనిచేస్త: గంగుల

వచ్చే ఎన్నికల కోసం ప్రతిపక్షాలు పనిచేస్తే..బీఆర్ఎస్ మాత్రం వచ్చే జనరేషన్ కోసం పనిచేస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆస్తి అని.. మిగతా పార్టీలు ఢిల్లీ పార్టీలన్నారు. ఇతర పార్టీల చేతిలో తెలంగాణను పెడితే కరెంట్, నీళ్లు లేక మునుపటి పరిస్థితి వస్తుందన్నారు గంగుల. తమ కోసం ఐదు నెలలు పనిచేస్తే..  వచ్చే ఐదేళ్లు ప్రజల కోసం  పనిచేస్తామన్నారు.

ALSOREAD: బీజేపీ టికెట్ల కోసం భారీ పోటీ.. మొత్తం 6003 అప్లికేషన్లు
 

 కరీంనగర్ లోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన  బీఆర్ఎస్ మీటింగ్ లో గంగుల సమక్షమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. ఆతర్వాత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా  నివాళులర్పించారు  గంగుల కమలాకర్ . కరీంనగర్ లోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.