
కరీంనగర్ జిల్లా: వికలాంగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. శనివారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలోదివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. 152 మంది దివ్యాంగులకు... సుమారు 60 లక్షల రూపాయల విలువచేసే సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్..అన్ని అవయవాలు చక్కగా ఉండి... వక్రబుద్ధి ఉన్నవాడే వికలాంగుడు అన్నారు. వికలాంగులను గౌరవించి... వారి సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తోందన్నారు. గతంలో 10 సార్లు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినా... రిక్షా ఇచ్చిన పాపాన పోలేదన్నారు.అనంతరం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 144 మంది లబ్ధిదారులకు రూ. 1.43 కోట్ల విలువ చేసే కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి గంగుల కమలాకర్.