అన్నింటికీ కరీంనగర్​ నుంచే నాందీ! .. కరీంనగర్ సభలో సీఎం కేసీఆర్

అన్నింటికీ  కరీంనగర్​ నుంచే నాందీ! ..  కరీంనగర్ సభలో సీఎం కేసీఆర్
  • రైతుబంధు, దళితబంధు, రైతు బీమా ఇదే గడ్డ మీద ప్రకటించుకున్నం
  • మంత్రి గంగుల పట్టువదలని లీడర్ అని కితాబు 

కరీంనగర్, వెలుగు: తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ప్రజలకు, వ్యక్తిగతంగా తనకు అనేక విజయాలు అందించిన కరీంనగర్ మట్టికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. ఎస్​ఆర్​ఆర్​ కాలేజీకో ప్రత్యేక ఉందని, తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2001 మే 17న మొట్టమొదటి సభ సింహగర్జన సభ ఇదే కాలేజీ గ్రౌండ్ లో పెట్టుకున్నామని గుర్తుచేశారు. శుక్రవారం కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ తీసుకురాకపోతే తనను రాళ్లతో కొట్టి చంపమని ఇదే గ్రౌండ్ నుంచి చెప్పానని, అప్పుడు ఎంత మంది ఉన్నారో.. ఇప్పుడు అంతకు మూడు రెట్ల మంది బయట ఉన్నారన్నారు. ఆ సభ ఉద్యమ చరిత్రలోనే మొట్టమొదటి ఘట్టమని, రైతుబంధు, దళితబంధు, రైతు బీమా కరీంనగర్ వేదిక నుంచే ప్రకటించుకున్నామని చెప్పుకొచ్చారు. 

సుందరంగా కరీంనగర్ సిటీ

కరీంనగర్ ఎంతో సుందరంగా తయారైందని, ఇప్పుడు నగరం అని పిలవాలని అనిపిస్తోందని సీఎం అన్నారు. గంగుల కమలాకర్ మొండి మనిషి అని, పట్టువదలడు కాబట్టి వెంబడిపడి మానేరు రివర్ ఫ్రంట్ కట్టిస్తున్నారని ప్రశంసించారు. 'ఇయ్యాల కరీంనగర్ చౌరస్తాలు ఎట్లయినయి, రోడ్లు ఎట్లయినయి. సందులు గొందులన్నీ దుమ్ము ధూళీ లేకుండా ఎట్లున్నయి.. దయ చేసి మీరు ఆలోచించాలె' అని ప్రజలను కోరారు. ఇప్పటికే తీగల వంతెన ఏమిట్లకు ఏమి కాలేదని, అప్పుడే సందర్శకులు వచ్చిపోతున్నారన్నారు. దానికి ముత్తమెంత డాంబర్ కారితే, దానిని కూలగొట్టాలని కొందరు మాట్లాడుతున్నారని, వాళ్లకు తలకాయ, బుద్ధి ఉందా అని మండిపడ్డారు.

ఇలా మాట్లాడేవారికి అభివృద్ధి నమూనా తెలుస్తదా అని ఫైర్ అయ్యారు. నాలుగు పనులు చేస్తే అందులో ఒకటి దొరకబట్టి ఈక మీద తోక, తోక మీద ఈక పెట్టి దానికి రంగుల పూసి మాట్లాడుతారని, ఏం చేయకుంటే ఇంట్లో పంటే వాళ్లకు గొప్పోడన్నారు. గంగుల కమలాకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని, కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.  కరీంనగర్​సభలో కళాకారుల ఆటపాట ప్రజలను అలరించాయి. సింగర్​మధుప్రియ పాటలతో హోరెత్తించారు. 

హుజూరాబాద్ కు ఏం తక్కువ చేసిన?

జమ్మికుంట సభలో సీఎం కేసీఆర్​ హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలవుతున్న స్కీములు, పనుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'హుజురాబాద్ కు ఏం తక్కువ చేసిండు కేసీఆర్. మీ కాల్వలు లైనింగ్ చేయించలేదా.. వారాబందీ బంద్ చేయించి కాల్వల నిండా నీళ్లు ఇస్తలేమా. మీకు రైతుబంధు రాలేదా. మీదగ్గర దళితబంధు అన్ని ఇళ్లకు రాలేదా.. మీకు ఇన్ని ఇచ్చిన కేసీఆర్ ను కాదని ఎవ్వన్నో ఎత్తుకుంటే మీకొచ్చేది ఏమున్నది. ఆలోచన చేయమని కోరుతున్నా. కౌశిక్ రెడ్డిని గెలిపిస్తే హుజూరాబాద్ కు నేను అండగా ఉంటా. ఇక్కడ బీజేపీ ఆయన గెలిస్తే ఏమైతది. మొన్న ఎన్నేళ్లయే గెలిచి. ఏమన్న అయిందా ఏక్ అణా పని. మళ్లీ గెలిస్తే ఏం చేస్తాడు?’ అని పరోక్షంగా ఈటల రాజేందర్​ను విమర్శించారు.

 గోపాల్ రావుపేట, గర్శకుర్తిని మండలాలుగా చేస్తా

చొప్పదండి నియోజకవర్గంలో సుంకె రవిశంకర్ ను గెలిపిస్తే గోపాల్ రావుపేట, గర్శకుర్తిని మండలాలుగా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రూ.వెయ్యి కోట్లతో అంజన్న ఆలయాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దే బాధ్యత తనదన్నారు.  రవిశంకర్  కొట్లాడి 100 బెడ్ల హాస్పిటల్ శాంక్షన్ ​చేయించుకున్నారన్నారు. 

బొందలగడ్డగా ఉన్న కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేశాం..

బొందల గడ్డగా ఉన్న కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోట్లాది రూపాయలు వెచ్చించి గొప్పగా అభివృద్ధి చేశారని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. తెలంగాణ రాకముందు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎట్లా ఉందో ఇప్పుడు ఇలా ఉందో చూడాలని ప్రజలను కోరారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేని తెలంగాణ ఊహించలేమని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్రిద పాలనలో అన్ని విధాలా మోసపోయామన్నారు. సమైక్య పాలనలో ఆడబిడ్డలు నీళ్లకోసం అరిగోసపడ్డారని, సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాక నీటి కొరత తీరిందన్నారు.