పదేండ్లలో 50 ఏండ్ల అభివృద్ధి చేసిన : గంగుల కమలాకర్

పదేండ్లలో 50 ఏండ్ల  అభివృద్ధి చేసిన : గంగుల కమలాకర్
  •     నిర్మించే వాళ్ల వైపు ఉంటారో.. కూల్చేవాళ్ల వైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలి
  •     నామినేషన్ ర్యాలీలో మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల 

కరీంనగర్, వెలుగు : కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 40–50 ఏండ్లలో జరగని అభివృద్ధి 10 ఏండ్లలో చేశానని, ఈ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే గెలిపించాలని మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ ​రాకముందు కరీంనగర్ ఎలా ఉందో.. ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.  తన కోసం 20 రోజులు పని చేస్తే వచ్చే ఐదేళ్లు ప్రజల కోసం తన రక్తం ధారబోస్తానన్నారు. బుధవారం గంగుల కమలాకర్ ​నామినేషన్​ వేశారు. ఈసందర్భంగా సిటీలోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

అంతకుముందు నామినేషన్ పేపర్లతో స్థానిక హనుమాన్, యజ్ఞ వరాహస్వామి ఆలయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌక్ లో భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కోట్లాది రూపాయలు తెచ్చి అభివృద్ధి చేశానన్నారు. కేబుల్ బ్రిడ్జి, రివర్ ఫ్రంట్, మెడికల్ కాలేజీ, టీటీడీ, ఇస్కాన్ టెంపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చానన్నారు. కేబుల్ బ్రిడ్జి కూలిపోతుందని బీజేపీ అభ్యర్థి సంజయ్​ ప్రచారం చేస్తున్నాడని, బ్రిడ్జిలు నిర్మించే వాళ్ల వైపు ఉంటారో.. విధ్వంసం కోరుకునేవాళ్ల వైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలన్నారు.

Also Read :- బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై రైడ్స్ ఎందుకు జరగడం లేదు

మళ్లీ ఆంధ్రా నాయకులు ఏకమవుతున్నారని, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి హైదరాబాద్ సంపద దోచుకెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో శాంతిభద్రతల బాగుండడం వల్లే పెట్టుబడులు వస్తున్నాయని, మత విద్వేషాలు రెచ్చగొడితే కంపెనీలు వస్తయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి వేలంలో టికెట్ కొనుక్కొని వచ్చారని, బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ ​కరీంనగర్​అభివృద్ధికి నయాపైసా తేలేదని ఆరోపించారు. ఓటు వేశాక తప్పు చేశామని కర్నాటక ప్రజలు బాధపడుతున్నారని, ఆ తప్పు ఇక్కడ జరగకుండా చూసుకోవాలని సూచించారు. 

ఎప్పటికీ గెలిచేది న్యాయం, సత్యమే

గత ఎన్నికల్లో కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తనపై ప్రతిపక్షాలు చేసిన కుట్రలు వీగిపోయాయని,  నామినేషన్ వేసిన రోజే హైకోర్టు తీర్పు రావడం ఆ దేవుడు సైతం తనకు అండగా ఉన్నట్లు భావిస్తున్నానని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నామినేషన్  వేసిన అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ.. తనకు వేంకటేశ్వర స్వామి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు. బండి సంజయ్ వేసిన ఇంకో కేసు నుంచి కూడా బయటపడతానని ఆశాభావం వ్యక్తం చేశారు. 

జనసంద్రమైన  తెలంగాణ చౌక్.. 

మంత్రి గంగుల నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలిరావడంతో తెలంగాణ చౌక్ జనసంద్రంగా మారింది. గులాబీల జెండలమ్మ.. రామక్క పాటకు కార్యకర్తలతో కలిసి మంత్రి గంగుల  స్టెప్పులు వేశారు. జై గంగుల.. జై తెలంగాణ నినాదాలతో  ఆప్రాంతమంతా హోరెత్తింది. గంగుల ప్రసంగం మధ్యలో నమాజ్ స్టార్ట్ కావడంతో పూర్తయ్యే వరకు ప్రసంగాన్ని ఆపారు. అన్ని మతాలను గౌరవించినప్పుడే ఎలాంటి అసమానతలు, ఘర్షణలు ఉండవని గంగుల పేర్కొన్నారు. నామినేషన్​ ర్యాలీలో మేయర్ వై.సునీల్ రావు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, కొత్త జయపాల్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.