పటాకులు వద్దు.. దీపాలే వెలిగించండి

పటాకులు వద్దు.. దీపాలే వెలిగించండి

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి సందర్భంగా పటాకులు కాలిస్తే 6 నెలల వరకూ జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తామని ఢిల్లీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గోపాల్ రాయ్ హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో పటాకులను తయారు చేసినా, నిల్వ చేసినా ఎక్స్ ప్లోజివ్స్ యాక్ట్ లోని సెక్షన్ 9బీ ప్రకారం.. మూడేండ్ల జైలు శిక్ష, రూ. 5 వేల ఫైన్ తప్పవన్నారు. పటాకులు వద్దు.. దీపాలే వెలిగించండి (దియే జలాలో పటాఖే నహీ)అంటూ ఈ నెల 21న ఓ అవేర్ నెస్ క్యాంపెయిన్ ను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం కన్నాట్ ప్లేస్ లోని సెంట్రల్ పార్కులో 51 వేల దీపాలను వెలిగించనున్నట్లు వెల్లడించారు.

పటాకులపై నిషేధాన్ని అమలు చేసేందుకు 408 టీంలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, రాజధానిలో మూడు రకాల ఫైర్ క్రాకర్ల వాడకాన్ని వచ్చే ఏడాది జనవరి 1 వరకూ నిషేధిస్తున్నట్లు గత సెప్టెంబర్ లోనే ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. రెండేండ్లుగా అమలు చేస్తున్నట్లుగానే ఈ ఏడాది దీపావళికి కూడా పటాకులపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.