బసవేశ్వరుడి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలె

బసవేశ్వరుడి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలె

రంగారెడ్డి జిల్లా: లింగాయత్ ల ఆరాధ్య గురువు శ్రీ బసవేశ్వరుడి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మంత్రి హరీశ్ కోరారు. జిల్లాలోని గండిపేట మండలం కోకాపేటలో రూ.10 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న శ్రీ బసవేశ్వర ఆత్మ గౌరవ భవానానికి మంత్రులు సబిత, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీతో కలిసి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్ రావు మాట్లాడారు. బ్రహ్మశ్రీ బసవేశ్వర గొప్పతనాన్ని చాటిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని స్పష్టం చేశారు. అందులో భాగంగా హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై బసవేశ్వర విగ్రహాన్ని పెట్టామన్నారు. అంతేకాక రూ.100 కోట్ల విలువైన స్థలంలో బలిజల కోసం భవన నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు.

అది రాబోయే రోజుల్లో విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఎదిగేందుకు ఒక పునాది కావాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాక బలిజ శెట్టి లింగాయత్ ల సమాజాన్ని రాజకీయంగా సైతం ఎదిగేలా సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పించి.. లింగాయత్ ల అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎంపీ బీబీ పాటిల్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.