
మహాకూటమికి ఓటమి భయం పట్టుకుందని మంత్రి హరీశ్ రా వు అన్నా రు. సోమవారం గజ్వేల్ లో జరిగిన ముదిరాజ్ ల ఆశీర్వా ద సభలో ఆయన మాట్లా డారు. టీడీపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తే నాలుకలు చీరేస్తామని ఘాటుగా హెచ్చరిం చారు. డిసెంబరు 11 తరువాత తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ కావడం ఖాయమన్నారు. రేవూరి ప్రకాశ్ రె డ్డి దిక్కు తోచక ఏదేదో మాట్లా డుతున్నా రని మండిపడ్డారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు టీడీపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ వందకు పైగా సీట్లు గెలవడం ఖాయమన్నా రు. గజ్వే ల్ నియోజకవర్గం లో కేసీఆర్ రికార్డు మెజార్టీతో గెలుపొం దుతారన్నారు. గత పాలకులు మహిళలు ఖాళీ బిం దెలతో నిలదీసినా పట్టిం చుకోలేదని, కేసీఆర్ నాలుగున్నరేళ్లలో నీటి గోస లేకుండా చేశాడన్నారు. నీళ్లివ్వని పార్టీకి ఓటడిగే హక్కు లేదు.. యాభై ఏళ్లు పాలిం చి గజ్వే ల్ కు నీళ్లు ఇవ్వని కాం గ్రెస్
పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదని హరీశ్ రా వు అన్నా రు. గజ్వే ల్ పట్టణంలో సోమవారం నిర్వహిం చిన ఏకలవ్య, బైండ్ల కుల సంఘాల ఆశీర్వా ద సభలతో పాటు కొల్గూ రులో టీఆర్ ఎస్ లోకి చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. కాం గ్రెసోళ్లు క్వార్టర్ సీసాలను నమ్ము కుంటే.. మేము గోదావరి నీళ్లను నమ్ముకున్నామన్నారు.
గజ్వే ల్ లో ఇద్దరు తోడు దొంగలు కలిసి ఓట్లడుగుతున్నా రన్నా రు. స్థలం ఉండి ఇళ్లు కట్టుకునే వారికి రూ.5 లక్షల రుణం ఇస్తామని వచ్చే మేనిఫెస్టోలో చేర్చినట్లు చెప్పా రు. విద్యా ఉద్యోగ కాం ట్రాక్ట్ వ్యవస్థలో ఏకలవ్యులకు రిజర్వేషన్ కల్పి స్తామన్నారు.వాళ్లు క్వార్టర్ సీసాలు నమ్ముకున్నారు మేం గోదావరి నీళ్లను నమ్ముకున్నాం : హరీశ్ రావు మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల బతుకులు చిధ్రమేనని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నా రు. ముదిరాజ్ ల ఆశీర్వా ద సభలో ఆయన మాట్లా డారు. కేసీఆర్ ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిం చాలని పిలుపునిచ్చారు. టీడీపీ, కాం గ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నా రు. కేసీఆర్ రూ.వెయ్యి కోట్లతో మత్స్యకార భవనాలను నిర ్మించారన్నా రు. భవిష్యత్తులో అర ఎకరం చెరువులకు సంబంధిం చి సభ్యత్వాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ముదిరాజ్ లను బీసీ–డి గ్రూపు నుం చి ఏ గ్రూపునకు మార్చా లని అసెంబ్లీ లో గతంలో తాను కోరగా అప్పటి కాం గ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిచిం దని, స్వల్ప కాలంలోనే రిజర్వేష న్ల విషయం సుప్రీం కోర్టుకు చేరిందన్నారు.ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన తీర్పు వచ్చేలా తాము ప్రయత్నిస్తామన్నారు.